Ts Crime: భర్తను చంపితే 15 లక్షలు, అడ్వాన్స్ 2 లక్షలు.. భార్య షాకింగ్ ఆఫర్!

కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహిత రేణుక ప్రియుడి కోసం భర్తను చంపేందుకు 15 లక్షల సుపారీ ఇచ్చింది. అదృష్టవశాత్తు భర్త కుమార్ గాయాలతో తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విషయం తెలుసుకున్న పోలీసులు భార్యతో సహా ఇతర నిందితులను అరెస్టు చేశారు.

New Update
కామారెడ్డి క్రైమ్

కామారెడ్డి క్రైమ్

Ts Crime: కామారెడ్డిలో మరో కిరాతక భార్య బాగోతం వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపేందుకు ఏకంగా 15 లక్షల సుపారీ ఇచ్చింది.   2 లక్షల అడ్వాన్స్ కూడా ముట్టజెప్పింది. కానీ ఈమె ప్లాన్ ఫలించలేదు. చివరికి సుపారీ గ్యాంగ్ తో సహా అరెస్టై జైలుకు వెళ్ళింది. ఈ స్టోరీ గురించి తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి. 

ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

15 లక్షల సఫారీ

ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన సాడెం కుమార్ మేడ్చల్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అయితే అతడి భార్య రేణుక సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి లలితమ్మ గుడి పూజారి మహేశ్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్త కుమార్ కి తెలియడంతో.. దీనిపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. 

ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

అక్రమసంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి  భారీ స్కెచ్ వేసింది రేణుక. భర్త కుమార్ ని  మర్డర్ చేసేందుకు సుపారీ గ్యాంగ్ తో 15 లక్షల డీల్ కుదుర్చుకుంది.  రూ.2లక్షలు అడ్వాన్సు కూడా ఇచ్చింది. మహ్మద్ అశ్వక్‌, ముబిన్, ఆమీర్, అన్వర్, మోసిన్‌తో మర్డర్ డీల్ మాట్లాడుకుంది. రేణుక ప్లాన్ ప్రకారం సఫారీ గ్యాంగ్ కుమార్ పై దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు కుమార్ గాయాలతో తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య రేణుకతో పాటు ప్రియుడు మహేశ్, సుపారీ గ్యాంగ్ ను అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

kamareddy crime | latest-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు