/rtv/media/media_files/2025/04/22/g5K5O53vq9TdDmecnKKW.jpg)
jaggareddy help
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితొ బాధపడుతోంది. అయితే ఈ విషయం తెలుసుకుని జగ్గారెడ్డి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంతేకాకుండా వైద్యం కోసం రూ.10 లక్షల నగదు సాయం కూడా చేశారు జగ్గారెడ్డి.
Also read : మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)
ఎమ్మెల్యే కాకపోయిన
ఇప్పటికే తన భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దిక్కులేని జీవితం గడుపుతున్నట్లుగా ఆమని తన బాధను జగ్గారెడ్డి ముందు వెళ్లబోసుకుంది. ఇలాంటి టైమ్ లోనే తనకు ఇలా క్యాన్సర్ సోకడంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని.. అయితే తన పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నానని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ పరిస్థితిలో జగ్గారెడ్డి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని జగ్గారెడ్డి భరోసాను ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాకపోయిన ప్రజల కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని సాటి మనిషిగా తన వంతుగా సహాయం చేసి ఓ కుటుంబానికి జగ్గారెడ్డి అండగా నిలవడం పట్ల నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.
Also read : Madhya Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఎనిమిది మంది మృతి!
ఆపద అంటే ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరీ క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించి,నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మన జగ్గారెడ్డి..#jaggareddy#congress#sangareddy#cmrevanthreddy#amanipic.twitter.com/eIVojN4v9X
— Turupu Jagga Reddy (@ImJaggaReddy) April 22, 2025
Also Read: జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
Also Read: గూగుల్ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
medak | cancer-patient | telangana