కేసీఆర్ స్వరంలో భయం కనిపించిందని రఘునందన్ రావు అన్నారు. నిన్న నిర్వహించిన రజతోత్సవ సభలో యువత కనిపించలేదన్నారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించారని ఆరోపించారు. 350 కోట్లు ఖర్చు పెట్టి నిన్న బీఆర్ఎస్ సభ నిర్వహించిందన్నారు. ఈ మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా మాట్లాడింది లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చుట్టాలంతా కోటీశ్వరులయ్యారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి రైలు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్ కే దక్కిందన్నారు. నిన్నటి మీటింగ్ ద్వారా తన వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ స్పష్టం చేశాడన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ లో కూరలో కరివేపాకు లాంటి వాడని ఎద్దేవా చేశారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
(bjp mp raghunandan rao | kcr | harish-rao | telugu-news | telugu breaking news)
Follow Us