/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-8-jpg.webp)
Kaleshwaram Commission
Kaleshwaram Commission: కాళేశ్వరంపై విచారణలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతానని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయనిపుణులతో ఆయన చర్చించినట్లు సమాచారం. జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కమిషన్ జూన్ 5న హాజరుకావాలని కేసీఆర్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. కమిషన్ ముందుకు వెళ్లకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ విచారణ కమిటీ ముందుకు వెళ్లనున్నారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
తొలిసారిగా కేసీఆర్ కళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లనున్నారు. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, హరీశ్ రావులకు కూడా నోటీసులు పంపారు. వారు కూడా విచారణకు హాజరుకానున్నారు. దర్యాప్తు సంస్థ ముందుకు వెళ్తానని ఇప్పటికే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న ఈటెల రాజేందర్, చివరగా జూన్ 9న హరీష్ రావు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పీసీ ఘోష్ కమిషన్ తెలిపింది. 14 నెలలుగా కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది. ఇందులో ఇప్పటివరకు 200 అధికారులను విచారించారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన 25 మంది ఐఏఎస్‌ను కూడా కమిషన్ ప్రశ్నించింది. వారిలో పలువురు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ పేర్లు ప్రస్తావించారు.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
Follow Us