Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత..స్పాట్‌లో..

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించింది. దీంతో  17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరిన చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్‌ ఇంజక్షనే దీనికి కారణమని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.

New Update
FotoJet - 2025-11-16T084308.251

Injection gone wrong..

Nalgonda Dist: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌(nagarjuna-sagar) లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించింది(injection-failure). దీంతో  17 మంది చిన్నారులు అస్వస్థత(Children Sick) కు గురవ్వడం కలకలం రేపింది. వైరల్‌ ఫీవర్‌ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్‌ ఇంజక్షనే దీనికి కారణమని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. దీంతో వారిని అత్యవసర చికిత్స అందిస్తున్నారు.చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీలతోపాటు సాగర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన 21 మంది చిన్నారులు విషజ్వరాలతో మూడు రోజుల క్రితం నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి వచ్చారు.. ఫీవర్‌ అధికంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తు్న్నారు.

Also Read :  iBOMMA: కరీబియన్‌ దీవుల్లో ఉండి "బొమ్మ' చూపించాడు.. కోట్లల్లో సంపాదన

Injection Gone Wrong

కాగా, శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో ట్రీట్‌మెంట్‌లో భాగంగా డ్యూటీలో ఉన్న నర్సు వీరిలో 17 మంది చిన్నారులకు సెలైన్‌ పెట్టింది. అనంతరం యాంటీ బయాటిక్‌ ఇంజక్షన్‌ వేసింది. ఫీవర్‌ తగ్గిన తరువాత వారిలో 12 మందిని డిశ్చార్జి చేశారు. అయితే ఇంటికి వెళ్లిన అరగంట తర్వాత చిన్నారులు వాంతులు, విరేచనాలు, చలిజ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రికి రాత్రే 8 మంది చిన్నారులను తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు.  అయితే  ఏదో జరిగిందని అనుమానించిన వైద్యులు.. మిగిలిన నలుగురు చిన్నారులనూ ఫోన్‌ చేసి ఆస్పత్రికి పిలిపించారు. వారందరితో పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి కూడా అలాగే మారడంతో ఆందోళన చెందిన వైద్యులు మొత్తం 17 మంది చిన్నారులను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.  ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. అర్ధరాత్రి విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భానుప్రసాద్‌ ఆస్పత్రికి చేరుకొన్నారు. మరో డాక్టర్‌ను పిలిపించి చిన్నారులకు వైద్య సేవలు అందించారు. దీంతో చిన్నారులు కోలుకుంటున్నట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు.

కాగా విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, డీసీహెచ్‌ మాత్రునాయక్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకున్నా రు. అయితే యాంటీ బయాటిక్‌ ఇంజక్షన్‌ వేయడం వల్ల చిన్నారుల శరీరం డీహైడ్రేట్‌ అయిందని, దీంతో కడుపులో మంట, వాంతులు, విరేచనాలు అయి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని డీసీహెచ్‌ వివరించారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే నిజ నిర్ధారణకు కమిటీ వేసి మూడు రోజుల్లో విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌ స్పష్టం చేశారు.

Also Read :  సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లా?... అవినీతి కేంద్రాలా?  ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత

Advertisment
తాజా కథనాలు