iBOMMA: కరీబియన్‌ దీవుల్లో ఉండి "బొమ్మ' చూపించాడు..కోట్లల్లో సంపాదన

కొత్త సినిమాలనే టార్గెట్‌గా చేసుకుని iBOMMA ద్వారా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న నిర్హహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ దీవుల్లో ఉంటూ.. ఇమ్మడి రవి ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

New Update
FotoJet - 2025-11-15T212245.752

iBOMMA administrator arrested

iBOMMA: అది ఎంత కొత్త సినిమా కానీ, కోట్లు పెట్టి నిర్మించిన చిత్రం కానీ, అతను వెంటనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తాడు. కోట్లు పెట్టి నిర్మించిన చిత్రం పైరసీగా మారి ఇటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో ఆ నిర్మాత తలమీద తడిగుడ్డ ఏసుకొని వెక్కివెక్కి ఏడవాల్సిందే. "అయ్యోయ్యో చేతిలో డబ్బు పోయేనే...సినిమా ఆడకపోయేనే' అంటూ కుళ్లికుళ్లి కుమిలిపోవలసిందే. సుదీర్ఘకాలంగా రిలీజైన గంటల్లోనే ఇంటర్నెట్‌ లో ప్రతక్ష్యమవుతున్న చిత్రాలపై నిర్మాతలు మండిపతడుతున్నారు. ఆయా చిత్రాలను ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూనే ఉన్నారు. కాగా, కొత్త సినిమాలనే టార్గెట్‌గా చేసుకుని iBOMMA ద్వారా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న నిర్హహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

రవి అనేక సినిమాలకు పైరసీలు తయారు చేసి ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రవి పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు సంపాదించినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవి కూకట్‌పల్లిలోని రెయిన్‌ విస్టా ఫ్లాట్‌లో ఉన్న సమయంలో పోలీసులకు సమచారం అందింది. వెంటనే రైడ్‌ చేసిన పోలీసులు  అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్‌ దీవుల్లో ఉంటూ.. ఇమ్మడి రవి ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా పోలీసుల విచారణలో తెలిసింది.

 కాగా పైరసీ చిత్రాలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఐ బొమ్మతోపాటు, 65 పైరసీ వెబ్సైట్ లపై కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 
ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను గతంలోనే హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.  అయితే నన్ను పట్టుకోలేరంటూ గతంలో పోలీసులకే సవాలు విసిరిన రవిని ఈరోజు ఉదయం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి ఇచ్చిన సమాచారంతో రవి ఏజెంట్ల నెట్వర్క్‌తోపాటు హ్యాండ్లర్ల నెట్వర్క్ పై కూడా సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు