ACB raids: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లా?...అవినీతి కేంద్రాలా?  ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత

తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ లుగా మారిపోయాయి. ప్రతి దానికి లంచాలకు అలవాటు పడిన అధికారులు ప్రజల్ని పట్టి పీడించుకు తింటున్నారు. తాజాగా ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలువురు అవినీతి అధికారులు పట్టుబడ్డారు.

New Update
ACB raids electricity official Ambedkar residence in Hyderabad

ACB raids electricity official Ambedkar residence in Hyderabad

 ACB raids: తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ లుగా మారిపోయాయి. ప్రతి దానికి లంచాలకు అలవాటు పడిన అధికారులు ప్రజల్ని పట్టి పీడించుకు తింటున్నారు. దీంతో కడుపు మండిన సామాన్యులు అవినీతి నిరోదక శాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయల లంచం సొమ్ము పట్టుబడుతోంది.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. మొత్తం 23 బృందాలతో ఇవాళ సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్.., మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల్, పెదపల్లి, భూపాలపల్లి, వైరా ఇలా అన్ని ఏరియాల్లో ఉన్న కార్యాలయాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది.

 ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో లెక్కతెలియని రూ. 2,51,990 డబ్బును ఏసీబీ సీజ్ చేసింది. 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో పాటు, కార్యాలయాల్లో నగదు స్వాధీనం చేసుకుంది. 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు.. అనుమతి లేకుండా కార్యాలయాల్లో వ్యవహారాలు నడుపుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. కాగా చాలా కాలంగా ఆయా  కార్యాలయాల్లో CCTV కెమెరాలు పని చేయడం లేదని ఏసీబీ గుర్తించింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మరోవైపు13 మంది SROల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్బంగా  నగదు, ఆభరణాలు, ప్రాపర్టీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు