Crime News: మైనర్ బాలికపై హత్యాచారం.. పోక్సో చట్టం కింద నిందితుడికి ఉరిశిక్ష
నల్గొండలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడిన కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా వేసింది. పదేళ్ల క్రితం జరగ్గా తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.