/rtv/media/media_files/2025/08/03/cyber-crime-2025-08-03-10-59-37.jpg)
CYBER CRIME
Cyber ​​Crime :సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా. నేరగాళ్లు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అమాయకులపై పంజా విసిరి కోట్లల్లో దోచుకుంటున్నారు. ఇప్పటివరకు అనేక రకాలుగా దోపిడికి పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు ఇపుడు సరికొత్త ప్లాన్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా 'ఫోన్ కాల్' మోసానికి(cyber crime fraud calls) తెరలేపారు. ఈస్కామ్(cyber crime cases)లో ఒక్క ఫోన్ కాల్‍తో మీ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో మన కాంటాక్టులతో పాటు ఆర్థిక సంబంధిత అంశాలన్నీ వారి చేతికి చేరుతాయి. ఈ తరహా మోసం ఇప్పుడు అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: అందాల గేట్లు తెరిచిన 'కల్కి' బ్యూటీ.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!
If You Call That Number - Your Account Will Be Empty
డెలివరి బ్లూ డార్ట్ సేవల పేరుతో ఈ మోసం జరుగుతుండటం గమనార్హం. తాజాగా హైదరాబాద్‍లోని ఓ సీనియర్ జర్నలిస్ట్ కు కాల్‌చేసిన కేటుగాళ్లు ఆయనను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. శనివారం ఉదయం సదరు జర్నలిస్ట్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. డెలివరీ బ్లూడార్ట్ (Delivery Blue Dart) నుంచి మాట్లాడుతున్నామని చెప్తూ. మీ అడ్రస్ దొరకడం లేదు. మా డెలివరీ ఏజెంట్ మీ ఏరియాలోనే ఉన్నారు. డెలివరీ బాయ్ ఫోన్ నంబర్ పంపిస్తున్నాం. అతడికి ఫోన్ చేయండి అంటూ అవతలి వైపు వ్యక్తి చెప్పారు. డెలివరీ బాయ్ కి చెందిన నంబర్ గా *21*9123114243 అంటూ అతనికి ఫోన్ చేయాలని చెప్పారు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం అని గ్రహించిన సదరు జర్నలిస్టు వారితో సంభాషణను అంతటితో ముగించేశారు.
Also Read: పర్యాటకులకు గుడ్ న్యూస్..స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం..దీని ప్రత్యేకతలివే..
అయితే ఈ నంబర్ ఫార్వర్డ్ మెసేజ్ కు సంబంధించిన కోడ్ అని తేలింది. వారు చెప్పినట్లుగా ఈ నంబర్ కు డయల్ చేస్తే మనకు వచ్చే ప్రతి ఫోన్ కాల్,మెసేజ్ ఇకపై సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అవుతాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.కాగా గత ఆదివారం తెలంగాణలో ఏపీకే పైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టించారు. ఎస్ బీఐ ఖాతాలకు మీ కేవైసీ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని ఒకే రోజు వందల వాట్సాప్ గ్రూప్ లపై దాడికి తెగపడ్డారు. ఈ ఏపీకే ఫైల్స్ ఎటాక్‍లో ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులు సైతం ఎఫెక్ట్ అయిన విషయం తెలిసిందే.
Follow Us