Bed Bugs : క్రైం కేసుల ఛేదనలో డిటెక్టివ్‌లుగా నల్లులు..!

నల్లులు అనగానే మనకు ఒక విధమైన జలధరింపు వస్తుంది. అవి కనపడితే వెంటనే చంపేయాలని చూస్తుంటాం.  అయితే నల్లులతో నేర సంఘటనలను చేధించవచ్చంటున్నారు మలేసియాకు చెందిన శాస్త్రవేత్తలు. నల్లులను మచ్చిక చేసుకొని వాటితో పరిశోధనలు కూడా  చేస్తున్నారు.

New Update
FotoJet - 2025-12-01T124503.393

Bedbugs as detectives in solving crime cases

నల్లులు(bed-bugs) అనగానే మనకు ఒక విధమైన జలధరింపు వస్తుంది. అవి కనపడితే వెంటనే చంపేయాలని చూస్తుంటాం.  అయితే నల్లులతో నేర సంఘటనలను చేధించవచ్చంటున్నారు మలేసియా(malaysia)కు చెందిన శాస్త్రవేత్తలు(scientists). నల్లులను మచ్చిక చేసుకొని వాటితో పరిశోధనలు కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో అనేక నేర కేసుల్లో ఇవే కీలక డిటెక్టివ్‌లుగా మారే అవకాశం ఉందంటున్నారు. వాటి సహాయంతో ఎన్నో నేర కేసులను ఛేదించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదైనా ఒక నేరం జరిగిన ప్రదేశంలో అప్పటికే  నల్లులు గనక ఉంటే బాధితులు, లేదా అనుమానితులను గుర్తించేందుకు అవి ఎంతో  సహాయపడతాయని ఇటీవల చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు ఉత్తర పెనాంగ్‌లోని సైన్స్ యూనివర్శిటీ ఆఫ్ మలేషియా (USM) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

తమ శాస్ర్తవేత్తల బృందం దాదాపు అర్ధ దశాబ్దం పాటు యూఎస్‌ఎమ్‌ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ ప్రయోగశాలలో నల్లులపై అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్త అబ్దుల్ హఫీజ్ అబ్ మజీద్ పేర్కొన్నారు. తాము చేపట్టిన పరిశోధనలో నల్లులు మానవుల నుంచి రక్తాన్ని పీల్చిన దాదాపు 45 రోజుల వరకు వారి డీఎన్‌ఏ నల్లుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒకవేళ రక్తాన్ని పీల్చకపోయినప్పటికీ నిందితులు వాడిన దుప్పట్లు, మంచాలు, దిండులపైన అవి తిరిగినా వారి డీఎన్‌ఏ నల్లుల్లో ఉంటుందని గుర్తించారు. కొన్ని క్రైం కేసుల్లో బాధితులు, లేదా నిందితుల ఆచూకీ తెలియనప్పుడు వారుండే స్థలంలో నల్లులు ఉంటే వాటి నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా నిందితులను గుర్తించడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Also Read: పర్యాటకులకు గుడ్‌ న్యూస్‌..స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం..దీని ప్రత్యేకతలివే..

సాధారణంగా నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు దర్యాప్తు చేసే సమయంలో ఘటనా స్థలంలోని రక్తపు మరకల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా నిందితులు, బాధితులకు సంబంధించిన  వివరాలను గుర్తించడం సర్వసాధారణం. అదే విధంగా ఘటన స్థలంలో ఉన్న నల్లుల్లో ఉన్న డీఎన్‌ఏ ద్వారా బాధితులు లేదా నిందితుల జెండర్‌, కంటి రంగు, జుట్టు, చర్మం రంగు వంటి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దోమలు, ఈగల మాదిరిగా నల్లులు ఎగరడానికి అవకాశం లేదు.దీంతో మనుషుల నుంచి ఒక బిందువు పరిమాణంలో రక్తాన్ని పీల్చగానే వాటి కడుపు నిండిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో అవి ఎక్కువ దూరం కదలలేక అక్కడే ఉండి పోతాయని..అవి ఎంతదూరం ప్రయాణించిన కేవలం 20 అడుగుల దూరం వరకు మాత్రమే వెళ్లగలుగుతాయి. అందువల్లే నిందితులను గుర్తించడంలో అవి కీలకంగా మారుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి దుప్పట్లు, దిండులలో దాక్కొని ఉంటాయి కాబట్టి నిందితులకు సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం కూడా ఉండదన్నారు.

Also Read: అందాల గేట్లు తెరిచిన 'కల్కి' బ్యూటీ.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!

Advertisment
తాజా కథనాలు