Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తెలంగాణలోని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ.. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు నుంచే వారికి స్నాక్స్ అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పీఎస్ పరిధి పద్మానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
రెండు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజువారి తనిఖీల్లో భాగంగా అమీర్‌పేట మైత్రివనం దగ్గర చేసిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.25 లక్షల నగదును స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై బీఆర్కే భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచే నామినేషన్ల సందడి నెలకొంది. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా బీఆర్ఎస్ మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి నవీన్‌కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక మిగిలిన బీజేపీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు.