TG Police: తగ్గిన క్రైమ్‌ రేటు..పెరిగిన నమ్మకద్రోహం..పోలీస్ వార్షిక నివేదికలో సంచలనాలు

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో  నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను ఆయనఈరోజు విడుదల చేశారు.

New Update
FotoJet (53)

DGP Shivdhar Reddy

TG Police : తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి(new DGP Shivdhar Reddy) అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో  నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను ఆయనఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది 2,34,158 కేసులు నమోదు అయితే 2025 సంవత్సరంలో 2.28,69 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బీఎన్ఎస్ కేసులు 2024 లో 1,69,477 నమోదు అయితే 2025లో 1,67,018 కేసులు నమోదు అయ్యాయని ఇవి గతేడాదితో పోలిస్తే 1.45 శాతం తగ్గినట్లు వెల్లడించారు.

Also Read :  Telangana Rewind 2025 : తెలంగాణలో 2025 విషాదాలు... విశేషాలు..

509 మంది నక్సల్స్ లొంగుబాటు

తెలంగాణలో ఈ ఏడాది 509 మంది నక్సల్స్ లొంగిపోయారని.. వారిలో 481 మంది ఛత్తీస్‌గఢ్, 21 మంది తెలంగాణ, ఒకరు మహారాష్ట్ర, ఒకరు ఏపీ నక్సల్స్ ఉన్నారని తెలిపారు. నాలుగు నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించమన్నారు. 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు. మూడు అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సస్ ఫుల్‌గా నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో మహిళా పోలీసు అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఐడీ చీఫ్, ఏసీబీ డీజీ చారు సిన్హా , తెలంగాణ పోలీస్ అకాడమీ(telangana-police-department) డైరెక్టర్ అభిలాష బిస్తా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా షికా గోయల్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి వారిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్ బ్యాక్ కోసం ఈ ఏడాది ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సమర్థవంతంగా ఈవెంట్లు

నేర నిరూపణ శాతం 3.09 శాతం పెరిగిందని ఇది గతేడాది 35.63 శాతం ఉంటే ఈ ఏడాది 38.72 శాతం ఉందని తెలిపారు. ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్ష విధించబడిందన్నారు. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందని చెప్పారు. పోక్సో చట్టం కింద నమోదైన మొత్తం 141 కేసుల్లో ఈ ఏడాది 154 మంది నిందితులకు జీవిత ఖైదు విధించబడిందని, 3 కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టం 28 కేసుల్లో 53 మంది నిందితులకు జీవిత ఖైతు విధించబడిందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు, మిస్ వరల్డ్ పోటీలు, ఫుట్‍బాల్ ఆటగాడు మెస్సీ ప్రోగ్రామ్, వరదలు వంటి విపత్తులతో కూడిన ముఖ్యమైన ఈవెంట్లను తెలంగాణ పోలీస్ సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు.

పెరిగిన డ్రగ్స్‌ కేసులు

తెలంగాణలో డ్రగ్స్ కేసులు భారీగా పెరిగాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం డ్రగ్స్ కేసులు పెరిగినట్లు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న నిందితులను ఈగల్ టీమ్ పట్టుకొస్తోందన్నారు. ఈగల్ టీమ్ ఈ ఏడాది రూ.173 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసిందని అన్నారు. నమ్మక ద్రోహం కేసులు తెలంగాణలో 23 శాతం పెరిగాయన్నారు. ఐపీసీ సెక్షన్ కింద కేసులు 7.83 % పెరిగాయని.. అలాగే మహిళలపై దాడులు కేసులు 2.90 % పెరిగాయని అన్నారు. 248 మంది మహిళల హత్యలకు గురైయ్యారని తెలిపారు. రేప్ కేసులు 13% తగ్గిందని, కిడ్నాప్‌లు 10% , వేధింపులు కేసులు 9% తగ్గాయని అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 23% రికవరీ చేసిందని... రూ. 246 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 25,500 మంది బాధితులకు రూ.159 కోట్లు రీ ఫండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.దేశంలో 41 శాతం సైబర్ నేరాలు పెరిగితే.. తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని వివరించారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

Also Read :  నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

నయీమ్‌ భూములు కొనద్దు

ప్రైవేటు సంస్థల్లో మహిళల కోసం కమిటీలు ఏర్పాటు చేశామని.. పోష్ యాక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నామని.. ఇందులో 18 నుంచి 35 ఏళ్ళు లోపు ఉన్న వారు హాజరువుతారని తెలిపారు. టీజీ ఆర్టీసీ డ్రైవర్లను ఈ ఏడాది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా పరీక్ష నిర్వహించామన్నారు. నయీమ్ కేసు సీఐడీ విచారణలో ఉందన్నారు. నయీమ్ కేసులో సీజ్ అయిన ల్యాండ్స్, చాలా మంది అమ్మాలని ప్రయత్నం చేశారని తెలిపారు. నయీమ్ లాండ్స్‌పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ల్యాండ్ ఎవరూ కొనవద్దని, అమ్మవద్దని ఆదేశాలు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

స్పోర్ట్స్ ఈవెంట్లలో సత్తా

డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్లలో తెలంగాణ పోలీసులు తమ సత్తా చాటారని డీజీపీ వెల్లడించారు.జార్ఖండ్ లో నిర్వహించిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులు 18 పతకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ లో తెలంగాణ పోలీసులు 10 పతకాలు సాధించారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు