Future City: ఫ్యూచర్‌ సిటీకి పోలీస్‌ కమిషనరేట్‌..కమిషనర్‌గా సుధీర్‌బాబు

ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తుంది. GHMC విస్తరణ,తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా వీటిని పునర్వ్యవస్థీకరించింది. శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి,ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడానికి నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.

New Update
FotoJet (47)

Appointment of Police Commissioners

Future City : ప్రభుత్వం ప్రకటించినట్లుగానే పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తుంది  GHMC విస్తరణ,తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా, తెలంగాణ ప్రభుత్వం పోలీసు పరిపాలనను పునర్వ్యవస్థీకరించింది, శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి,ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడానికి నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ కమిషనరేట్: అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు

సైబరాబాద్ కమిషనరేట్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గం, మరియు పటాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్‌సి పురం మరియు అమీన్‌పూర్ వంటి ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలతో సహా ఐటీ హబ్‌లు

మల్కాజ్‌గిరి కమిషనరేట్ (కొత్తది): కీసర, షామిర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ (కొత్తది): చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మరియు పరిసర ప్రాంతాలు

యాదాద్రి–భువనగిరి జిల్లాను కమిషనరేట్ అధికార పరిధి నుండి మినహాయించారు. ఎస్పీతో ప్రత్యేక పోలీసు యూనిట్‌గా పనిచేస్తారు.

ఈ పునర్వ్యవస్థీకరణ GHMC జోనింగ్ సంస్కరణలు,తెలంగాణ రైజింగ్ 2047 కింద CURE–PURE–RARE ప్రాంతీయ అభివృద్ధి వ్యూహానికి అనుగుణంగా ఉంటుంది. ప్రభుత్వం ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ర్టానికి అతి ముఖ్యమైన ఓఆర్‌ఆర్‌ లోపలి 27 మునిసి పాలిటీలను జీహెచ్‌ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్‌ వ్యవస్థీకరించింది.

602313032_1308118508013817_8635683159932413942_n

నాలుగు కమిషనరేట్‌లకు పోలీస్ కమిషనర్ల నియామకం  

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... ఈ పోలీస్‌ కమిషనరేట్లకు సంబంధించి కమిషనర్ల నియామకంలో భాగంగా నలుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనర్‌గా ఉన్న జి.సుధీర్‌బాబును ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషన ర్‌గా నియమించారు. సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న అవినాష్‌ మహంతిని మల్కాజిగిరి కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇప్పటివరకు లాజిస్టిక్స్‌ విభాగం ఐజీగా పనిచేసిన ఎం.రమేష్ ను సైబరాబాద్‌ కమిషనర్‌గా నియమించారు. కాగా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ కొనసాగనున్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న భువనగిరి ప్రాంతాన్ని.. ఈ నాలుగు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడా లేకుండా మినహాయించారు. దీనిని ప్రత్యేక పోలీస్‌ యూనిట్‌గా ఏర్పాటుచేసి.. యాదాద్రి-భువనగిరి జిల్లాగా పేర్కొంటూ ఆ జిల్లా ఎస్పీగా అక్షాంశ్‌ యాదవ్‌ను నియమించారు.

ఫ్యూచర్‌ సిటీపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌ పరిధిలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లు ఉండగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రస్తుతం ఫ్యూచర్‌ సిటీ ప్రాంతం రాచకొండ పరిధిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాలు మెరుగవుతాయని అందువల్ల పోలీసుల పర్యవేక్షణ కూడా పెరగాల్సి ఉంటుంది. పైగా అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతానికి తరలివస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో వాటి భద్రత ప్రాధాన్యం సంతరించుకోనుంది. అందుకే ఫ్యూచర్‌ సిటీ ప్రాంతంలో శాంతిభద్రతలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్‌గా  ఏర్పాటు చేస్తూ  నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. 

Advertisment
తాజా కథనాలు