/rtv/media/media_files/2025/12/30/fotojet-52-2025-12-30-12-51-54.jpg)
Telangana Rewind 2025
TelanganaRewind 2025: ఈ ఏడాది మరో రోజుతో ముగిసిపోతుంది. కానీ 2025 సంవత్సరం తెలంగాణకు మిగిలిన సంతోషాలు, దుంఖాలు మాత్రం అంతత్వరగా మనల్ని విడిచిపెట్టవు. ఈ ఏడాది తెలంగాణకు అనేక విషాదాలను మిగల్చడమే కాకుండా, విశేషాలను కూడా తీసుకొచ్చింది. 2025 ఒక్క ఏడాదిలోనే రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమదాలు, ఇతర ప్రమాదాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పొయారు. మరోవైపు తెలంగాణలో గతంలో జరగని ఎన్నో ఈవెంట్స్ హైదరాబాద్ వేదికగా జరిగాయి. ఆ విషాదాలు..విశేషాలు ఏంటో ఒకసారి నెమరువేసుకుందాం..
Also Read : తగ్గిన క్రైమ్ రేటు..పెరిగన నమ్మకద్రోహం..పోలీస్ వార్షిక నివేదికలో సంచలనాలు
సిగాచి ఇండస్ట్రీస్ లో భారీ పేలుడు..
2025 ఏడాదిలో తెలంగాణనే కాదు యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు. పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలడం కారణంగా సుమారు 40 మందికిపై కార్మికులు మృతి చెందారు. ఇందులో కొందరు కార్మికలు అక్కడికక్కడే మంటల్లో సజీవదహనం అయ్యారు. కొంతమంది మృతదేహాలు కూడా లభించలేదు. వీరిలో చాలా వరకు వలస కూలీలే ఉన్నారు. అలాగే ఈప్రమాదంలో మరో 33 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వ పరిహారం కూడా ప్రకటించింది. ఇది 2025లో తెలంగాణలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
బస్సు ప్రమాదం..
తెలంగాణలో జరిగిన మరో ప్రమాదం అడిలాబాద్ ప్రైవేట్ బస్సు ప్రమాదం, అడిలాబాద్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఇది కూడా రాష్ట్రంలో బస్సు ప్రమాదాల శ్రేణిలో భాగమైంది. అలాగే భద్రాచంలో నిర్మాణంలోని భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/ab877dp0toob60fyozlt-2025-12-30-12-53-35.webp)
SLBC టన్నెల్‌లో ప్రమాదం..
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందించేందుకు చేపట్టిన SLBC ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల్ పనుల్లో 14 కిలోమీటర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 22న రాత్రి 8:30 గంటల సమయంలో కార్మికులు పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలిపడటంతో కాంక్రీట్ పెచ్చులు ఊడి పడి 8 మంది ఉద్యోగులు, సిబ్బంది చనిపోయారు.
పాతబస్తీలో గుల్జార్ హౌజ్..
ఇక ఈ ఏడాదిలో జరిగిన మరో ఘోర ప్రమాదం. హైదరాబాద్(hyd-accidents)లోని పాతబస్తీలో ఉన్న గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం. ఇది కూడా యావత్తు తెలంగాణను దిగ్బ్రాంతి గురిచేసింది. గటన. ఈ ప్రమాదం మే 18వ తేదీన తెల్లవారుజామున చోటు చేసుకుంది.హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌజ్‌లో తెల్లవారు జామున మంటలు(Fire accidents) చెలరేగి సుమారు 17 మంది సజీవ దహనమయ్యారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికిలో చిన్నారు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
చేవెళ్ల బస్సు ప్రమాదం..
ఇక తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన మరో ఘోర ప్రమాదం. నవంబర్ 3వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం. హైదరాబాద్(road accidents in hyderabad) నుంచి తాండూరు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును హైదరాబాద్-బీజాపూర్ హైవేపై గ్రావెల్ లోడెడ్ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 19-20 మంది అక్కడికక్కడే మరణించారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.
రాజకీయాలు
వివాదాల్లో కొండా సురేఖ
తెలంగాణ రాజకీయాల్లో ఈ ఏడాది మంత్రి కొండా సురేఖ చుట్టూ మరోసారి దుమారం రేగింది. ఆమెకు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఉన్న సుమంత్‌పై ఆరోపణలు రావడం.. ఆయన్ను ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తప్పించడం.. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన్ను విచారణకు పిలుస్తారనడం... ఇలా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో కొండా సురేఖ పదవి ఊడుతుందనే ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఎన్నికలు
మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో మాగంటి సతీమణి సునీతకు బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించింది. కాగా ఈ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మంత్రివర్గ విస్తరణ
ఈ ఏడాది మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి లభించింది. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనకు పదవి దక్కింది. ఆయనకు మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్టర్‌గా అజారుద్దీన్ అక్టోబర్31న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. ఆయనతో ప్రమాణం చేయించారు.
బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు కవిత సస్సెండ్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా చేసిన ఈ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి హారీష్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తదితరులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించగా ఆమెను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. దీనికి ప్రతిగా ఆమె ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయడంతో పాటు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసింది. అయితే అవి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ రాష్ర్ట వ్యాప్తగా జనంబాట పేరుతో యాత్ర నిర్వహిస్తున్నారు. త్వరలో సొంతంగా పార్టీ పెడుతారనే ప్రచారం సాగుతోంది.
Also Read : హైదరాబాద్‌లో ఘనంగా శ్వాస ఐడియాస్ లోగో ఆవిష్కరణ
తెలంగాణలో విషాదాలతో పాటు కొన్ని విశేషాలు కూడా తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటాయి. వాటిలో కొన్ని...
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/miss-world-2025-opal-suchata-2-2025-06-d0b1ef2fed8564194667b79c6a0f6628-2025-12-30-12-55-17.webp)
1. మిస్ వరల్డ్ 2025..
మే నెలలో HITEX వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు(Miss World 2025 Contest) నిర్వహించడంతో హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 100కిపైగా దేశాల అందగత్తెలు చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించగా ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ తన శోభను, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటింది.
2. రికార్డు స్థాయి బతుకమ్మ వేడుక..
సెప్టెంబరులో జరిగిన బతుకమ్మ వేడుకలు చరిత్ర సృష్టించాయి. సరూర్‌నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తైన పూల బతుకమ్మను నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో రెండు రికార్డులు సాధించారు. వేలాది మహిళలు పూల మధ్య నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/29092025_bathukamma-flower-festival-04-2025-12-30-12-59-45.jpg)
3. సల్మాన్ ఖాన్‌తో హై-ఆక్టేన్ థ్రిల్స్ ..
డిసెంబర్ 6న గచ్చిబౌలిలో జరిగిన ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) ఈవెంట్ నగరాన్ని ఉర్రూతలూగించింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరుకావడంతో రేసింగ్ ఈవెంట్ ఓ పెద్ద సెలబ్రేషన్‌గా మారింది. అంతర్జాతీయ బైకర్లు చేసిన విన్యాసాలు అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.
4. మెస్సీ మ్యాజిక్..
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రావడం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ అద్భుతంగా నిర్వహించబడింది. అంతర్జాతీయ మీడియా సైతం హైదరాబాద్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ప్రశంసించింది. అభిమానులతో మెస్సీ కలిసిమెలిసి గడిపిన క్షణాలు మరపురానివి.
5. మ్యూజిక్‌తో మత్తెక్కిన సంవత్సరం..
ఎడ్ షీరన్ గిటార్ మ్యూజిక్‌తో మంత్రముగ్ధులను చేయగా, DJ స్నేక్ నగరాన్ని డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చాడు. సోనూ నిగమ్, శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్ పాటలతో సంగీత ప్రియులు మురిసిపోయారు. చివరగా ఏఆర్ రెహమాన్ సింఫోనిక్ నైట్‌తో ఏడాదిని అద్భుతంగా ముగించారు.
6. తెలంగాణ రైజింగ్..
భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్2025 అత్యంత విజయవంతంగా ముగిసింది. ప్రపంచ నేతలు, భారీ పెట్టుబడులు హైదరాబాద్‌ను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మరింత బలపరిచాయి. 2025కి వీడ్కోలు పలుకుతున్న వేళ హైదరాబాద్ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. పెద్ద ఈవెంట్లను సులువుగా నిర్వహించగల నగరమని ప్రపంచానికి నిరూపించాం. 2026 ఇంకా గొప్పగా ఉండాలని ఆశిద్దాం..
జాతీయ విషాదాలు..
తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలోనూ ఈ ఏడాది పలు తొక్కిసలాటలు జరిగి పలువురు మృత్యవాత పడ్డారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో అపశ్రుతి..
ఈ ఏడాది ప్రారంభంలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ‘మౌని అమావాస్య’ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా అపశ్రుతి జరిగింది. అఖాడాలకు కేటాయించిన సెక్టర్-2 ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఈ ప్రమాదం సంభవించింది.
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..
ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట(delhi train station stampede) జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. 12మంది గాయపడ్డారు(delhi stampede victims). మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు భారీగా భక్తులు పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
ప్రాణం తీసిన క్రికెట్ అభిమానం..
క్రికెట్ మీద ఉన్న అభిమానం ప్రాణాలు తీసింది. అమాయకులను బలి తీసుకుంది. అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట(Bengaluru Stampede News) జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత విజయోత్సవ వేడుకల కోసం చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 47మంది గాయపడ్డారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత పాసులు, అధిక జన సమూహం, సరైన నిర్వహణ లేకపోవడం తొక్కిసలాటకు దారితీశాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/2-12-2025-12-30-13-00-46.jpg)
కరూర్ తొక్కిసలాట ఘటన..
అభిమానం పెను విషాదమే నింపింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలి రావడం వారి పాలిట మృత్యువైంది. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. విజయ్ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అదే సమయంలో ఈ సభకు విజయ్ చాలా ఆలస్యంగా రావడం కూడా ప్రమాదానికి కారణమైంది.
భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని..
నవంబర్ 10న.. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 9 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న ఐ20 కారులో శక్తివంతమైన పేలుడు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Follow Us