/rtv/media/media_library/vi/UOtjdWiRD9Y/hqdefault-889254.jpg)
Telangana Assembly
Telangana Assembly Winter Sessions: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(telangana assembly session 2025) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు గతం కంటే వాడీవేడిగా సాగుతాయని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల అనంతరం సాగుతున్న తొలి సమావేశం కావడం, ఆ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో జోష్ మీదున్న ప్రభుత్వం ప్రతిపక్షాల మీదా అసెంబ్లీ లోనూ పై చేయి సాధించాలని చూస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా ప్రధానంగా నీటివాటాల కేటాయింపు అంశం మీద చర్చ సాగుతుందని తెలుస్తోంది. దీనితో పాటు జీహెచ్‌ఎంసీలో ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్‌ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్‌టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన రెండు ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్సులకు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అంశాలు చర్చకు రానున్నాయి.
అయితే తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష(టీఎస్‌ఎస్) ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు, తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 30న వైకుంఠ ఏకాదశి, 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు.. జనవరి 1 తొలిరోజు సందర్భంగా సమావేశాలు ఉండవు. తొలిరోజు సమావేశాలు ముగిసిన అనంతరం..ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇక తొలిరోజు సమావేశాల అనంతరం రెండు సభల్లోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు.
Also Read : మంచు దుప్పటి కప్పుకున్ననగరం.... కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
కృష్ణా, గోదావరి నదీ జలాలపై సుదీర్ఘ చర్చ
ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంపై చర్చించనున్నారు. ప్రధానంగా కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న వివాదం చర్చకు రానుంది. దీనిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో సీరియస్‌గా చర్చ సాగనుంది. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా.. ఈ వ్యవహారం బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. బీఆర్‌ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ప్రభుత్వం కోరిందని, ఇది తెలంగాణకు నష్టం చేకూర్చుతుందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. తాము 90 టీఎంసీలు కోరుతూనే.. ముందస్తుగా ట్రైబ్యునల్ పరిధిలోకి రాని 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలని మాత్రమే అడిగామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ అంశాలపై సభలో వాడీవేడి చర్చలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లలో చేపట్టిన కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికోసం చేసిన ఖర్చు, తద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు అందాయన్న వివరాలతో పాటు కృష్ణా, గోదావరి జలాల్లో ఏపీ, తెలంగాణకు కేటాయింపులు, అందుకు సంబంధించిన ఒప్పందాలు సభలో చర్చకు రానున్నట్లు సమాచారం. ఒకరోజు మొత్తం ఈ అంశంపై చర్చకే కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
సభకు కేసీఆర్ ?
శాసనసభ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు(KCR Attend To Telangana Assembly Session ?). ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో సమావేశాల్లో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణలు, ఎదుర్కోవాల్సిన తీరుతెన్నులపై కేసీఆర్ పార్టీ నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, డీపీఆర్ తదితర అంశాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన అనంతరం.. ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చించినట్లు సమాచారం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై బలంగా పార్టీ స్వరం వినిపించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. తొలిరోజు పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే సమావేశాల నేపథ్యంలో కనీసం 6 నెలలకు ఒకసారైన సభకు హాజరు కావాలన్న నిబంధన మేరకు కేసీఆర్ ఈ రోజ సభకు వచ్చి సంతకం చేసిన అనంతరం ఆ తర్వాత నుంచి తిరిగి వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 22 మంది
సాగునీటి అంశంపై చర్చకు మేం సిద్ధం: కేటీఆర్
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి అంశాలపై సభలో చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పాలమూరును సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ వలసల జిల్లాగా మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పాలమూరుకు రావలసిన నీళ్ల కోసం పోరాటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే ఆ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసిందని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల జలాలు చాలు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు గుర్తుచేశారు. అధికార పార్టీ వాళ్లు ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ అసెంబ్లీ నిర్వహించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఏ చర్చపెట్టినా తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. - telangana assembly live today
తప్పుదోవ పట్దిస్తోంది..రేవంత్ రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో వారి వాదనలను తిప్పికొడదాం. పూర్తి ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై శాసనసభలో చర్చ జరగనున్న నేపథ్యంలో కృష్ణా ట్రైబ్యునల్, ‘పాలమూరు’ ఎత్తిపోతలతో సహా కృష్ణా బేసిన్‌పై ఆదివారం అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి కోసం 7.15 టీఎంసీలతో పనులు చేయడానికి అనుమతించాలని నాడు బీఆర్‌ఎస్ కోరింది. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కావాలన్న అంశంపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చేలోగా తాగు, సాగుకు కలిపి 45 టీఎంసీలు వినియోగించుకొంటామని మనం కేంద్రాన్ని కోరినట్లు సీఎం చెప్పుకొచ్చారు.
Follow Us