/rtv/media/media_files/2025/12/29/navin-ayadav-2025-12-29-22-04-01.jpg)
నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ లో సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ లో రాశారు. అంతేకాదు ప్రచార పర్వం లోను ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అన్నారు.
భారీ మెజార్టీతో గెలుపు..
ఎంతో ఉత్కంఠగా సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. . పోస్ట్ బ్యాలెట్లు మొదలు కొని.. ప్రతీ రౌండ్‌లోనూ నవీన్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు. చివరకు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. దీని తరువాత ఆయన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్​ యాదవ్​.. తన కలను సాకారం చేసుకున్నారు. జూబ్లీహిల్స్​ గడ్డపై ఎమ్మెల్యేగా గెలిచి.. అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. రాజకీయాల్లోకి ఆయన 2009లో అడుగుపెట్టారు. ఎంఐఎంలో ప్రస్తానం ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు.
Follow Us