Telangana Assembly 2025: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ ల ఆందోళన

పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు మాజీ సర్పంచ్‌‌‌‌లను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు.

New Update
FotoJet (37)

Tension at the Assembly.. Former Sarpanchs' agitation

Telangana Assembly : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ(telangana assembly 2025 live) ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేసేందుకు సోమవారం మసాబ్ ట్యాంక్ లోని ఎన్నికల సంఘం ఆఫీస్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న జేఏసీ అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్‌‌‌‌తో పాటు పలువురు మాజీ సర్పంచ్‌‌‌‌లను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు.  తమకు సంబంధించిన రూ.531 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపిస్తూ, అసెంబ్లీని ముట్టడికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Also Read :  ఆస్ట్రేలియా ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ..!

Former Sarpanchs' Agitation At Telangana Assembly

ఈ క్రమంలో మాజీ సర్పంచులు సర్పంచ్‌లు, పోలీసులకు మధ్య తోపులాటలో పలువురు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిరసనకు దిగిన ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తోంది. ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ(telangana-assembly-latest-news) పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను పలువురిని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేసినా పెండింగ్ బిల్లులు రాక.. ఇప్పటికే చాలామంది సర్పంచులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా రూ. కోట్లు వెచ్చించి ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటోందని, కానీ, తమ బిల్లులు చెల్లించకపోవడం బాధాకరన్నారు. దయచేసి అసెంబ్లీ ముగిసేలోపు పెండింగ్‌‌‌‌లో ఉన్న రూ.500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

Also Read :  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థినుల మృతి

Advertisment
తాజా కథనాలు