సినిమా BREAKING: ఆర్జీవీ సంచలన నిర్ణయం! ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఆర్జీవీ. తాను ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై చట్టవిరుద్ధంగా అనేక కేసులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశించాలని కోరారు. ఈరోజు ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ భరోసా TG: మూసీ నిర్వాసితులకు అండగా ఉండేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. భూసేకరణ చట్టంప్రకారం పరిహారంతో పాటు బాధితుల కోసం 15వేల ఇళ్లను కేటాయించనుంది. అలాగే బాధితులు ఇల్లు కట్టుకునేందుకు ORR చుట్టూ 150 గజాల స్థలం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం! తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డాడు ఓ సైకో కిల్లర్.జైలు నుంచి విడుదలైన నిందితుడు రాహుల్ కేవలం 11 రోజుల్లో 5 హత్యలు చేశాడు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో.. By Bhavana 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్ మై హోం భుజలో దారుణం ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్మెంట్కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్మెంట్ నుంచి కింద పడి మరణించింది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల.. హైదరాబాద్‌లో మూడు చోట్ల ఒకే రోజు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాలకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. ! మణుగూరు ప్యాసింజర్ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు. By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Airports: తెలంగాణకు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు.. ఎక్కడో తెలుసా? తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు కోసం సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ చెప్పట్టాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: కాంగ్రెస్ నేత హనుమంతరావు కారుపై రాళ్ల దాడి! TG: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్ళతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం...ఇంకా అదుపులోకి రాని మంటలు హైదరాబాద్‌లో జీడిమెట్ల పారిశ్రామిక ఏరియాలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్వీ ప్లాస్టిక్ పరిశ్రలో అంటుకున్న మంటలు అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. దట్టమైనపొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. By Manogna alamuru 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn