NEW YEAR 2025: ఇదేం తాగుడు బాబోయ్.. రీడింగ్ పర్సంటేజ్ చూసి పోలీసులు షాక్!

న్యూ ఇయర్ వేడుక వేళ హైదరాబాద్‌లో కళ్లుచెదిరే సంఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా ఓ వ్యక్తికి 550 పర్సంటేజ్ చూపించింది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే బైక్ సీజ్ చేసి.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

New Update
Hyderabad police stunned by man breath test result

Hyderabad police stunned by man breath test result

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య 2024 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2025 ఏడాదికి వెల్‌కమ్ చెప్పారు. అదే క్రమంలో ఎంతో మంది యువత మద్యం మత్తులో తాగి తూలారు. రోడ్లపై విన్యాశాలు చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

Also Read: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు 

ఈ క్రమంలో పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి మందు బాబులకు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి ఊహించని రీడింగ్ పర్సంటేజ్ వచ్చింది. అది చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. సాధారణంగా 100 మిల్లీ గ్రాముల రక్తంలో 30మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఆల్కాహాల్ పర్సంటేజ్ ఉండాలి. ఒకవేళ బాడీలో 30 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఆల్కాహాల్ పర్సంటేజ్ ఉంటే మాత్రం వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. 

Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

550 పర్సంటేజ్

అయితే న్యూఇయర్ వేడుకల వేళ  హైదరాబాద్‌లోని పంజగుట్టలో పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ టెస్టులో ఓ వ్యక్తికి దాదాపు 550 పర్సంటేజ్ వచ్చింది. ఈ పర్సంటేజ్ అందరినీ షాక్‌కి గురిచేసింది. అందుకు సంబంధించిన రిసిప్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అది చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అంతలా ఏం తాగావ్ బ్రో అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. మరొకరేమో ఆ బైక్ పై ఎన్ని పెండింగ్ చలానాలు ఉన్నాయో చెక్ చేసి కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేశాడు. అతడి బైక్‌పై దాదాపు 11 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు ఓ రిసిప్ట్ పెట్టాడు. మొత్తానికి ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. 

పోలీసులతో వాగ్వాదం

పలు చోట్ల డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు రోడ్లపై బారికేడ్లు పెట్టి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎంతో మంది మద్యం ప్రియులు పట్టుబడ్డారు. రోడ్లపై వాహనాలత విన్యాసాలు చేస్తూ యువకులు హాల్ చల్ చేశారు. అదే సమయంలో పట్టుబడ్డ మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రోడ్లపై రచ్చ రచ్చ చేసిన మందు బాబులను పోలీసులు పట్టుకోగా.. వారు మారం చేశారు. వదులుతారా? లేదా? అంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయించడానికి పోలీసులు ప్రయత్నించగా.. మందుబాబులు రచ్చ రచ్చ చేశారు. ఎంత చెప్పినా వినలేదు. ముగ్గురు నలుగు పోలీసులు కలిసి వారితో టెస్ట్ చేయించారు. 

Also Read: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

అలాగే ఇంకొందరు కూడా పోలీసులకు అస్సలు సహకరించలేదు. వెహికల్స్ ఆపి చెక్ చేయగా.. పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని ఎలా ఆపుతారు అంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఇంకొందరు మాత్రం న్యూ ఇయర్ ఒక్కరోజే తాగుతున్నాం సర్ అంటూ పోలీసులతో రిక్వెస్ట్‌గా మాట్లాడారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు