Maoist Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. కీలక నేత లొంగుబాటు

వరుస లొంగుబాట్లు, ఎన్‌ కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలకనేత గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోవడం సంచలనం రేపింది.

New Update
FotoJet

Maoist barsi deva Surrender

Maoist Surrender :  వరుస లొంగుబాట్లు, ఎన్‌ కౌంటర్ల(encounter)తో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు(moaists) పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలకనేత తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోవడం సంచలనం రేపింది. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు హిడ్మా వంటి ముఖ్యనేతలు పలువురు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వరుస లొంగుబాట్లు, మావోయిస్టుల మీద ప్రభుత్వం పై చేయి సాధించడం, అఫరేషన్‌ కగార్‌తో మావోయిస్టుల మీద ఉక్కపాదం మోపడం వంటి కారణాలతో  పార్టీ బలహీనపడంది. మరోవైపు పలువురు అగ్రనేతలు వయోభారంతో ఆరోగ్య సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. దీంతో  గత ఏడాది వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తాజాగా మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత లొంగుబాటపట్టడం ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది.  

తాజాగా గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా(Maoist Barsi Deva) డీజీపీ శివధర్‌ రెడ్డి  ఎదుట లొంగిపోయాడు. మావో అధినేత హిడ్మా ఎన్‌ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. బర్సే దేవపై ప్రభుత్వం మొత్తం 50 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించింది.ఈ మేరకు బర్చేదేవ తన టీమ్ సభ్యులతో కలిసి లొంగిపోయి(maoist surrender to govt),  ఆయుధాలను అప్పగించారు. అతని లొంగుబాటు అంతర్గత భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మాంటేయిన్ LMG తుపాకీతో పాటు మరిన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా  రేపు (శనివారం) బర్సే దేవాను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దేవా లొంగిపోవడం, తదితర వివరాలను డీజీపీ మీడియా సమావశంలో చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Also Read :  మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బర్సేదేవా ఎవరంటే..

మావోయిస్టు పార్టీ కీలకనేత బర్సేదేవ(Maoist Leader Barsi Deva) అలీయాస్‌ సుక్కామావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం బర్సే దేవ దేశంలోని అత్యంత ప్రమాదకరమైన నక్సలైట్ నాయకులలో ఒకడైన మాడ్వి హిడ్మాకు సన్నిహిత సహచరుడు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలకు మాస్టర్ మైండ్ గా భావించే హిడ్మాతో కలిసి బర్సే అనేక పెద్ద ఆపరేషన్లలో పాల్గొని విజయవంతంగా నిర్వహించాడు.  వయసులో హిడ్మా కంటే వారం రోజులు చిన్న. దేవాది కూడా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని హిడ్మా స్వస్థలమైన పువర్తి గ్రామమే. ఇంచుమించు ఇద్దరూ ఒకేసారి మావోయిస్టు పార్టీలో చేరారు. పార్టీ బెటాలియన్‌ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు.

Also Read :  కాంగ్రెస్‌లో ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాటే శాసనమా!

పీఎల్‌జీఏకు కోలుకోలేని దెబ్బ

కాగా బర్సేదేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు(సీఎంసీకి) వెన్నెముకగా నిలిచిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) కార్యకలాపాలు దాదాపుగా ముగిసినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. హిడ్మా మృతితోనే పీఎల్‌జీఏ కార్యక్రమాలకు కోలుకోలేని దెబ్బ తగలగా దేవా లొంగుబాటుతో పీఎల్‌జీఏ కార్యకలపాలు ముగిసినట్లే అని  అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీ ఆపరేషన్లకు పీఎల్‌జీఏనే కీలకం. 1999 డిసెంబరు 2న కరీంనగర్‌ జిల్లా కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌లో అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి ఎలియాస్‌ శ్యాం, ఎరంర్రెడ్డి సంతోష్‌రెడ్డి ఎలియాస్‌ మహేశ్, శీలం నరేశ్‌ మృతిచెందగా వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పీజీఏను స్థాపించిన విషయం తెలిసిందే.

2004 సెప్టెంబరు 21న సీపీఐ-పీపుల్స్‌వార్‌.. మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీసీఐ)తో కలిసి సీపీఐ-మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఆ తర్వాత పీజీఏ... పీఎల్‌జీఏగా రూపాంతరం చెందింది. అప్పట్లో 8 బెటాలియన్లు.. 13 ప్లటూన్లతో సుమారు 10-12వేల మంది సైన్యంతో ఉన్న పీఎల్‌జీఏ మావోయిస్టు పార్టీ అనేక ఆపరేషన్లను నిర్వహించింది. అయితే వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో పలువురు అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ  బెటాలియన్లు సైతం  అస్తిత్వం కోల్పోతూ వచ్చాయి. చివరగా హిడ్మా నేతృత్వంలోని మొదటి బెటాలియన్‌ మాత్రమే ఇప్పటివరకు మిలిటరీ ఆపరేషన్లకు నేతృత్వం వహించింది. రెండేళ్ల క్రితం బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దానికి దేవా నేతృత్వం వహిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు