BREAKING: డ్రగ్స్ తీసుకున్న MLA కొడుకు అరెస్ట్

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో MLA కొడుకుని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.

New Update
sudhir reddy

BREAKING: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో MLA కొడుకుని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు. 

Also Read:'రాజాసాబ్' క్రేజీ అప్​డేట్.. 'నాచే నాచే' మాస్ సాంగ్ వచ్చేస్తోంది..!

Also Read:‘ది రాజా సాబ్’ ప్రభాస్ జోకర్ లుక్ పై డైరెక్టర్ మారుతి షాకింగ్ ట్విస్ట్..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచిన పోలీసులు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి, మరొక వ్యక్తి పోలీసులకు దొరికిపోయారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం సుధీర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. నిబంధనల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి చర్యల్లో భాగంగా ఆయనను డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. డ్రగ్స్ వినియోగంపై పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisment
తాజా కథనాలు