YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు మరోషాక్.. వీడియో కోసం ఇన్ స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

నా అన్వేషణ యూట్యూబ్‌, ఇన్ స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో వివాదాల్లో నిలుస్తున్న అన్వేష్ కు ఉచ్చు బిగుస్తోంది. హిందూ దేవతలపై వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాజాగా పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ వివరాలు తెలపాలంటూ లేఖరాయడం సంచలనంగా మారింది.

New Update
Naa Anveshana

Another shock for YouTuber Anvesh

YouTuber Anvesh: నా అన్వేషణ అనే యూట్యూబ్‌ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో నిత్యం వివాదాల్లో నిలుస్తున్న అన్వేష్ కు ఉచ్చు బిగుస్తోంది, ఇటీవల హిందూ దేవతలపై మాట్లాడిన మాటలు తీవ్ర వివాదానికి దారితీశాయి.  హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయనపై పలు చోట్ల కేసులు సైతం పెట్టారు.  తాజాగా పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ వివరాలు తెలపాలంటూ లేఖరాయడం సంచలనంగా మారింది.

Also Read :  గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను కాకుల్లా పొడవొద్దు.. ఈటల సంచలన కామెంట్స్!

అభ్యంతరకర వ్యాఖ్యలు

కాగా ఇటీవల పుచ్చకాయ, కీరదోసలతో సెక్స్ ఎడ్యూకేషన్ అంటూ చేసిన వీడియోలో సీతాదేవిని, ద్రౌపదిని కించపరిచేలా వాడిన పదాలు అన్వేష్ మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై  హిందూ సంఘాలు అన్వేష్ ను సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరుస్తున్నాయి. నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్ , ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా భారీ సంఖ్యలో అన్ ఫాలో చేయడంతో పాటు పలువురు నిరసనలు తెలపడంతో అన్వేష్ క్షమాపణలు చెబుతూ మరో వీడియో విడుదల చేశాడు. ఇదిలా ఉండగానే అన్వేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంతో ఆయనను వదిలేది లేదంటూ సినీ నటి కరాటే కళ్యాణి రెండు రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు

నా అన్వేషణ ఛానెల్ లో అన్వేష్‌ హిందూ దేవతలను అవమానించేలా(aa anvesh comments on hindu gods) మాట్లడిన అసభ్యపదాలు, నటుడు శివాజీ, ప్రవచన కర్త, ఆధ్యాత్మిక వేత్త గరికపాటి(Garikapati Case Against Naa Anveshana) లను బండబూతులతో దూషించిన అన్వేష్‌(Na Anveshana Arrest)పై కేసు నమోదైంది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతోపాటు ముఖ్యంగా పుచ్చాకాయి, కీరదోస చూపిస్తూ చేసిన వీడియో సీతమ్మవారిని అవమాన కరంగా మాట్లాడిన మాటలపై కరాటే కళ్యాణి తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక ఆయా వీడియో లింక్ లతో సహా, పూర్తి వివరాలతో పంజాగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్వేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 కఠినంగా శిక్షించాలి

కేవలం కేసు నమోదు చేసి ఊరుకోవడం కాదని, అన్వేష్(nvesh world traveler) ను ఇండియాకు రప్పించి, కఠినంగా శిక్షించాలంటూ మరోవైపు హిందూ సంఘాలు ఆందోళనలు తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో నా అన్వేషణ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు సంబంధించిన ఐడీతోపాటు , వివాదాస్పద వీడియో కంటెంట్ లింక్ ల వివరాలు కావాలంటూ ఇన్ స్టా గ్రామ్ కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాయడం చర్చనీయంశమైంది. పోలీసులు ఇన్ స్టాగ్రామ్ నుండి రిప్లయ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ నుండి  సమాధానం రాగానే  తదుపరి చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు.

Also Read :  మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. కీలక నేత లొంగుబాటు

హిందూ సంఘాల మండిపాటు

విదేశాల్లో ఉంటూ భారతదేశాన్ని అవమానించేలా అన్వేష్ మాట్లాడటంపై హిందూసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు్న్నాయి. అన్వేష్‌పై తీవ్రస్థాయిలో  మండి పడుతున్నాయి. ఓవైపు సోషల్ మీడియాలో అన్వేష్ అకౌంట్లు అన్ ఫాలో చెయాలంటూ పలువురు  ప్రచారం చేస్తుండగా,  మరోవైపు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే తను మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకుంటున్నాంటూ అన్వేష్  మరో వీడియో విడుదల చేసినప్పటికీ హిందూ సంఘాలు శాంతించడంలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి సైతం  వెనక్కు తగ్గనని తేల్చిచెప్పారు. తప్పు చేసి సారీ చెబితే సరిపోదు. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టబడుతున్నారు. ఇప్పటికే న్యాయనిపుణుల సలహా తీసుకున్న పోలీసులు అన్వేష్ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు