Drug Peddler: డ్రగ్ పెడ్లర్‌ యువతి అరెస్ట్‌.. అడిక్ట్‌ నుంచి పెడ్లర్‌గా మార్పు

రాజధాని హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా  డ్రగ్స్ పెడ్లర్లు కొత్తదారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు. తాజాగా గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
drugs

Drug peddler

Drug Peddler: రాజధాని హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా  డ్రగ్స్ పెడ్లర్లు కొత్తదారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు. తాజాగా గోవా(goa) నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్‌(banjara-hills)కు చెందిన హస్సాగా గుర్తించారు. 2024 డిసెంబరులో గోవా వెళ్లిన ఆమె అక్కడ మొదటిసారి MDMA రుచి చూసింది. ఆ తర్వాత మాదకద్రవ్యాలకు బానిసగా మారింది. - anti-drugs-team

Also Read :  Ghar Wapasi : కారెక్కుతామంటోన్న మాజీలు.. బీఆర్‌ఎస్‌లో ఘర్‌ వాపసీ

Drug Peddler Arrested

కేవలం వినియోగదారురాలిగానే కాకుండా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో డ్రగ్స్ పెడ్లర్‌గా మారినట్లు పోలీసులు వెల్లడించారు. గోవాలో నైజీరియన్ డ్రగ్ మాఫియాతో ఆమె సంబంధాలు ఏర్పచుకున్నట్లు  విచారణలో తేలింది. వారి వద్ద నుంచి తక్కువ ధరకు MDMA, LSD వంటి ఖరీదైన డ్రగ్స్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడి యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆమె పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈనెల 26న సియోలిమ్, మాపూసా ప్రాంతాల్లో ఆమె డ్రగ్స్ డీల్స్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

హస్సా గతంలో కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన ఆమె.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకుండా  మరింత పకడ్బందీగా హైదరాబాద్‌కు చెందిన మరికొందరు సహచరులతో కలిసి డ్రగ్స్ దందా కొనసాగిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నగరంలో ఆమె ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తోంది? ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొలుసుకట్టు నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read :  తగ్గిన క్రైమ్‌ రేటు..పెరిగిన నమ్మకద్రోహం..పోలీస్ వార్షిక నివేదికలో సంచలనాలు

Advertisment
తాజా కథనాలు