/rtv/media/media_files/2026/01/03/fotojet-67-2026-01-03-13-27-31.jpg)
TiE Hyderabad
TiE Hyderabad : గ్లోబల్ ఎంట్రప్రెన్యూరియల్ నెట్‌వర్క్ అయిన టై ఈ హైదరాబాద్, 2026 సంవత్సరానికి మురళీ కాకర్లను అధ్యక్షుడిగా, రవి చెన్నుపాటిని ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న రాజేష్ పగడాల నుండి ఇన్నోబాక్స్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు & సీఈఓ అయిన మురళీ కాకర్ల అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు . సుమారు మూడు దశాబ్దాల అనుభవం కలిగిన దూరదృష్టి గల పారిశ్రామికవేత్త గా గుర్తింపు పొందారు. టెక్నోక్రాట్ అయిన మురళీ, AMD, NVIDIA , PortalPlayer వంటి సంస్థల్లో ఇంజినీరింగ్ బృందాలను నిర్మించి, నడిపించిన విశేష అనుభవం కలిగి ఉన్నారు. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, వైర్‌లెస్ నెట్‌వర్కింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఆయన, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌లో పలు కీలక ఆవిష్కరణలకు దోహదం చేశారు. విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించే అంశంలో ఒక పేటెంట్‌ను కూడా కలిగి ఉన్న మురళీ, ఆవిష్కరణలు, వ్యాపారోత్సాహాన్ని ప్రోత్సహించడంలో ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ఇదిలా ఉండగా ఈజోన్ సెక్యూరిటీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన రవి చెన్నుపాటి, 2026 సంవత్సరానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇంజనీర్ తో పాటు పారిశ్రామికవేత్త అయిన రవి, భారత్, అమెరికా,ఆస్ట్రేలియాలలో టెక్నాలజీ, హెల్త్‌కేర్,సెక్యూరిటీ రంగాల్లో సంస్థలను నిర్మించి, విస్తరించారు. ఆయనకు ఈ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఈజోన్ సెక్యూరిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, అలాగే విగోకేర్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, సుస్థిర వ్యాపార వృద్ధి, టెక్నాలజీ ఆధారిత ఆపరేషన్లు, అమలు దృక్పథంతో కూడిన నాయకత్వ బృందాల అభివృద్ధిపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ప్రారంభ దశ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడం, మెంటారింగ్ చేయడం ద్వారా వ్యవస్థాపకులకు వ్యూహం, సిస్టమ్స్ థింకింగ్,ఆపరేషనల్ స్పష్టతపై మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మురళీ కాకర్ల మాట్లాడుతూ,“టై హైదరాబాద్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం నాకు గర్వకారణం. ఈ చాప్టర్ యొక్క గొప్ప వారసత్వాన్ని కొనసాగించే అవకాశం లభించడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. 2026లో నా ప్రధాన దృష్టి – ఎంట్రప్రెన్యూర్-ఫస్ట్ చాప్టర్‌గా టై హైదరాబాద్‌ను మరింత బలోపేతం చేయడం. లోతైన మెంటారింగ్, విలువైన కార్యక్రమాలు, స్కేల్-అప్ అవకాశాల ద్వారా వ్యవస్థాపకులకు అర్థవంతమైన విలువ అందించడమే లక్ష్యం అన్నారు. సభ్యుల సంతృప్తి, చార్టర్ మెంబర్లు, వ్యవస్థాపకులు, భాగస్వాములు , ఎకోసిస్టమ్ నాయకుల మధ్య బలమైన సహకారాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు, మూలధనం, నెట్‌వర్క్‌లకు స్టార్టప్‌లను అనుసంధానిస్తూ, గ్లోబల్ సంబంధాలు, క్రాస్-బోర్డర్ అవకాశాలను టై హైదరాబాద్ మరింత విస్తరిస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన, గౌరవనీయమైన టి.ఐ.ఈ చాప్టర్లలో ఒకటిగా కొనసాగుతూ, పారిశ్రామిక సమాజంలో ప్రేరణ, సేవాభావం, ‘ధృడమైన’ శక్తితో కూడిన సంస్కృతిని నిర్మించడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
ఇక ఈ కమిటీకి కొత్త బోర్డు సభ్యులుగా మురళీ కాకర్ల ( వ్యవస్థాపకుడు & సీఈఓ, ఇన్నోబాక్స్) అధ్యక్షుడిగా, రవి చెన్నుపాటి (మేనేజింగ్ డైరెక్టర్, ఈజోన్ సెక్యూరిటీ సొల్యూషన్స్) ఉపాధ్యక్షుడిగా, అలాగే రాజేష్ పగడాల (మేనేజింగ్ డైరెక్టర్, పగడాల కన్స్ట్రక్షన్స్ ఇమిడియేట్) పాస్ట్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2026 సంవత్సరానికి ఇతర బోర్డు సభ్యులుగా అనుజ్ కపూర్ – వ్యవస్థాపకుడు & పార్ట్నర్, అప్‌వైజరీ; గౌరవ్ మాథూర్ – సీఈఓ, క్రెడెరా ఇండియా; నీతికా మహేశ్వరి – సహ-వ్యవస్థాపకురాలు, అక్సిలెరో కార్పొరేషన్; శ్రీధర్ శ్రీరామనేని – సహ-వ్యవస్థాపకుడు & సీఓఓ, వీకామర్స్; శశిధర్ రెడ్డి – సీనియర్ వైస్ ప్రెసిడెంట్, క్వాల్కామ్; రాజ్ సమల – వ్యవస్థాపకుడు, రివాల్సిస్; రామ్ యెర్నేని – వ్యవస్థాపకుడు & సీఈఓ, ఐబేస్‌ఐటీ; రామకృష్ణ సి – సీఈఓ & వ్యవస్థాపకుడు, స్పూర్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా; సిద్ధార్థ మోహంతి – వ్యవస్థాపకుడు, భ్రమ కమల్; మరియు శ్రీ మైనేని – మాజీ సీఈఓ & సహ-వ్యవస్థాపకుడు, నోఆ సొల్యూషన్స్ & నోఆసాఫ్ట్ ఉన్నారు.
Follow Us