MLC Kavitha : కవిత ఇంటికి క్యూ కట్టిన జనం..కిక్కిరిసిన తెలంగాణ జాగృతి కార్యాలయం..ఎందుకంటే?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించగానే, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, ఉద్యమకారులు భారీగా ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు.

New Update
FotoJet (85)

Kalvakuntla Kavitha

MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించిన వెంటనే, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, ఉద్యమ కార్యకర్తలు భారీగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు. ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు కవితకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ప్రకటించారు. అయితే, తనను కలిసేందుకు వచ్చిన జనసందోహానికి కవిత ఇంటి బాల్కనీలో నిలబడి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు.
 
అనంతరం కిందకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కవిత పలకరించారు. “ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా?” అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుండి తన వెన్నంటి ఉండి, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.  కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె గొంతు కంపిస్తూ “మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మీరే నా బలం” అంటూ మాట్లాడారు. దీంతో జాగృతి కార్యాలయం పరిసర ప్రాంతాలు ‘జై తెలంగాణ’, ‘కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలతో మారుమోగాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవిత గారికి అండగా ఉంటామని వివిధ సంఘాల నేతలు కవిత సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. “ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవితకు అండగా ఉంటాం. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం” అని నినదించారు.

మరోవైపు, రాజకీయ శక్తిగా అవతరించబోతున్నామంటూ కవిత చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. కవిత రాజకీయ పార్టీని ప్రకటిస్తే... రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు