Etala Rajender : గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను కాకుల్లా పొడవొద్దు.. ఈటల సంచలన కామెంట్స్!

పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి అక్కున చేర్చుకోండి. కాకులు గద్దల లెక్క పొడవకండి. స్థానికంగా గ్రూపులు మంచివి కావు. గ్రూపులు బువ్వ పెట్టవని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలన్నారు.

New Update
FotoJet (3)

Etala Rajender Local Bodie Elections

Etala Rajender : పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి అక్కున చేర్చుకోండి. కాకులు గద్దల లెక్క పొడవకండి. స్థానికంగా గ్రూపులు మంచివి కావు. గ్రూపులు బువ్వ పెట్టవని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.  బీజేపీ నేతలు కూడా అలా ఆలోచన చేయాలి. పరిపక్వత పెరగాలి కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రాంత నాయకులతో నిర్వహించిన "మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
మనకు ఉన్న శక్తే తక్కువ అని ఇందులో గ్రూప్స్ అవసరమా ? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ళ మీద పడి నాయకులను కాపాడుకున్నాం. వేరే పార్టీ వారిని తెచ్చుకున్నాం, ఎన్నికల్లో గెలిపించుకున్నాం. మల్కాజిగిరి పార్లమెంట్ లో 1992 నుండి ఉంటున్న నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. 25 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకునే పని చేసే నిజమైన కార్యకర్తకు పిల్లల ఫీజు కట్టే డబ్బులు కూడా ఉండవు. పార్టీ బలంగా ఉంటే గెలవడానికి పైసలు అక్కర్లేదు. కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడవవు అని రాజేందర్‌ అన్నారు.
 
మోడీ ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశవ్యాప్తంగా ఒక వేవ్ వచ్చింది. ఈటల రాజేందర్ వల్ల కొంచెం ఎక్కువ ఓట్లు రావచ్చు కానీ గెలిచింది మాత్రం మోదీ వల్లనే. ఆ వేవ్ ను మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్లనే నాలుగు లక్షల మెజారిటీ వచ్చింది. గౌరవం పరస్పరంగా ఉండాలి. నువ్వు లీడర్లను గౌరవిస్తేనే..నిన్ను కార్యకర్తలు గౌరవిస్తారు. బీజేపీ అజేయమైన శక్తిగా ఎదగాలి. నన్ను మీరు గెలిపించారు. మీ గెలుపులో ఉడత భక్తిగా సాయం చేస్తా.నా చేతులు దండం పెట్టడానికి అలవాటు పడ్డాయి. నాకు ప్రజలే దేవుళ్ళు. మీకోసం ఎన్నిసార్లయినా దండం పెడతా అని ఆయన అన్నారు.
 
మన కొట్లాట వల్ల GHMC లో మన కార్పొరేటర్స్ కి 300 కోట్ల నిధులు వచ్చాయి. బీజేపీ లెటర్ ప్యాడ్ మీద లెటర్ పెడితే కోట్ల నిధులు వచ్చాయి. మోడీ ఎప్పుడూ నేను ఇచ్చిన అనరు, నేను సేవకుడిని మాత్రమే.. ప్రజలే యజమానులు అని అంటారు. ఇక్కడున్న సంకుచిత వాదులు మాత్రం నేను ఇచ్చిన అంటారు. గెలుపే లక్ష్యంగా పనిచేయడం నుండి నేను మీకు అండగా ఉంటాను అన్నారు. సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్న ఆయన మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడుతాయి. కానీ వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుందని ఈటల స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు