Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్రకు రూట్లు ఇవే!
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ తో పాటుగా సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ తో పాటుగా సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.
తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణపతిని పూజించేటప్పుడు మాత్రమే కాదు.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మళ్లీ చివరిసారిగా అగరబత్తులు, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి చేయాలని పండితులు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. రాజేంద్రనగర్ లోని బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లావాసులు శుక్రవారం జరిగిన వినాయక లడ్డూని వేలంలో రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు.
డప్పు చప్పుళ్లు.. భక్తి గీతాలు.. మహిళల కోలాట నృత్యాలు.. ఒగ్గుడోలు,ధూంధాంతో భక్తజనం వెంట నడవగా.. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర నగరంలో కన్నుల పండువగా సాగుతోంది. శనివారం వేకువజామునుంచే నిమజ్జనంతో నగరం సందడిగా మారింది.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి చేసి, హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ వినాయకుని మెడలో ఐదు తులాల బంగారంతోనే పొరపాటున నిమజ్జనం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు.
ఖైరతాబాద్ గణేష్‌ను నిమజ్జనం చేసే ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కలశం తొలగిస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చి శోభాయాత్ర నిర్వహిస్తారు. చివరిగా నిమజ్జనం చేసే ముందు మరోసారి హారతి ఇస్తారు.
ఘట్కేసర్ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది.