Hyderabad: కవులు, కళాకారులకు నకిలీ డాక్టరేట్లు.. హైదరాబాద్ లో నిర్వహకుడి అరెస్ట్

కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల్ని టార్గెట్ చేసి నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నపెద్దిటి యోహాను అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టరేట్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Fake doctorates for poets and artists

Fake doctorates for poets and artists

Crime News : కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల్ని టార్గెట్ చేసి నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్న పెద్దిటి యోహాను అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టరేట్ల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాగా తెలంగాణకు తలమానికమైన రవీంద్రభారతి వంటి పేరు గాంచిన కళాక్షేత్రాలలో కొంతమంది నకిలీ డాక్టరేట్లు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని సమాచారం రావడంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్‌ చేసి  అరెస్ట్ చేశారు. 

కాగా  గుంటూరు లోని గురజాలకు చెందిన పెద్దిటి యోహాన్ అనే వ్యక్తి గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో నకిలీ డాక్టరేట్లు ఇచ్చి మోసం చేస్తున్నాడని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితున్ని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. యోహాన్ నుంచి ఫేక్ డాక్టరేట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టరేట్లు ఇస్తానని చెప్పి ఆయన ఒక్కొక్కరి నుంచి 15వేల నుంచి 20వేల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.  

ఈ మేరకు రవీంద్ర భారతిలో ఆయన పలువురికి సర్టిఫికెట్లను అందజేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ నిమిత్తం అతడిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. సాహిత్యం, కళలు విభాగంతో వీటిని ఇస్తున్నారు. ఈమేరకు యోహానుపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంద్రప్రదేశ్ కు చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి పెద్దిటి యోహాన్‌ డాక్టరేట్లు ఇస్తామని నమ్మపాలికాడు. డాక్టరేట్ తీసుకున్న ఓ వ్యక్తి  తనకు నకిలీ డాక్టరేట్‌ఇచ్చాడని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పెద్దిటి యోహాన్ పై BNS యాక్ట్ 318 క్లాస్ 4 చీటింగ్ కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. కాగా, పెద్దిటి యోహాన్ వయస్సు 75 సంవత్సరాలు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

మరెన్నో సంస్థలు..

కళాసంస్థలు, సామాజిక సంస్థలు అవార్డుల పేరుతో సన్మానాలు, సత్కారాలు చేయడం సర్వసాధారణం. కానీ ఇటీవల ఏపీకి చెందిన కొన్ని సంస్థలతో పాటు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన కొంతమంది వ్యక్తులు ఏకంగా గౌరవ డాక్టరేట్లు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఇచ్చే డాక్టరేట్లను ఆయా సంస్థలు ఎగతాళి చేసేలా ఏకంగా డాక్టరేట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. వీటికోసం ఆయా సంస్థలు ఒక్కొక్కరి నంచి పదివేల నుంచి 50 వేల వరకు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంస్థలు చేసే ఇలాంటి దందాలతో సామాజిక, సాంస్కృతిక, సాహితీ, కళల రంగాల్లో సేవ చేస్తూ వస్తున్న నిజమైన సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Also Read :  జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్, బొంతు, CN రెడ్డి.. వారి బలాలు, బలహీనతలు ఇవే!

Advertisment
తాజా కథనాలు