/rtv/media/media_files/2025/10/07/a-cockroach-in-a-raagi-sankati-a-piece-of-chicken-in-paneer-biryani-2025-10-07-09-35-45.jpg)
A cockroach in a raagi sankati a piece of chicken in paneer biryani
Cockroaches In Biryani : తెలంగాణ వంటకాలంటే నోరురని వారుండరు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీఛాయ్, తలకాయ, బోటీ ఇలా ఎన్నో పసందైన వంటకాలు తెలంగాణకు ప్రత్యేకం. అందులోనూ హైదరాబాద్ బిర్యానీని ఒకసారైన ఆస్వాదించాలని అనుకోని వారుండరు(food lovers). కానీ, ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన రెస్టారెంట్లు, సుచి, శుభ్రత లేని వాతావరణం, అనుభవం లేని వంటవారితో హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు. దీంతో ఇప్పుడు హోటళ్లలో తినాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. గత కొంతకాలంగా నగరంలో ప్రముఖ రెస్టారెంట్లని చెప్పుకునే హోటల్స్‌లో కూడా పరిశుభ్రత(Food Quality) పాటించకుండా అబాసుపాలవుతున్నాయి. తినే ఆహారంలో బొద్దింకలు, జెర్రులు, ఈగలు ఇలా ఎవీ పడితే అవే వస్తున్నాయి. తాజాగా నానక్ రాం గూడలోని కృతుంగ రెస్టారెంట్లో రాగిసంకటిలో బొద్దింక దర్శనమిచ్చింది.
నగరంలోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఉన్న కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లిన ఒక కస్టమర్ రాగి సంకటిని ఆర్డర్ చేశారు. కస్టమర్ రాగి సంకటి తింటుండగా, సగం ప్లేట్ పూర్తి కాగానే అందులో బొద్దింక కనిపించింది. అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎంతో ఇష్టంగా తింటున్న ఆహారంలో బొద్దింక కనిపించడం దారుణమని ప్రశ్నించడంతో పాటు హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, కస్టమర్ పట్ల సరిగా స్పందించలేదని ఆయన ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ కస్టమర్.. హోటల్ కిచెన్ పరిసరాలను పరిశీలించారు. అపరిశుభ్రతతో నిండిన వాతావరణం, అలాగే కిచెన్ నుంచి వస్తున్న దుర్వాసన చూసి ఆయన మరింత ఆగ్రహంతో రాగి సంగటిలో బొద్దింక దృశ్యాలను వీడియో తీశాడు. తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు(food safety officers raids) ఫిర్యాదు చేశాడు. శుభ్రత పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు హోటల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాగి సంకటిలో బొద్దింక ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కృతుంగ రెస్టారెంట్‌కు రెగ్యులర్‌గా వెళ్లే కస్టమర్‌లు ఈ విషయం తెలుసుకుని షాకవుతున్నారు. ఈ సంఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవీన్ యాదవ్ ను అడ్డంగా ఇరికించిన రఘునందన్.. ఏం జరగబోతోంది?
పన్నీరు బిర్యానీలో చికెన్ ముక్కలు
ఇక షాద్‌నగర్ జడ్చర్లలో మరో వింత అనుభవం ఎదురైంది కస్టమర్‌కు. ఆయన పూర్తి శాఖహారి దీంతో హోటల్‌లో పన్నీర్ బిర్యానీ తిందామని వెళ్లాడు. కానీ హోటల్ నిర్వహకులు మాత్రం ఆయనకు పన్నీరుతో పాటు చికెన్ ముక్కలు కూడా కలిపి వడ్డించారు. ఈ విషయమై హోటల్ నిర్వాహకులను అడిగితే..నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు వినియోగదారుడినే తిట్టారు. షాద్‌నగర్ జడ్చర్ల రోడ్డులో ఉన్న డైమండ్ బావర్చి హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పన్నీరు బిర్యానీని ఆర్డర్ ఇచ్చాడు. కొంత బిర్యానీ తిన్న తర్వాత చికెన్ ముక్కలు నోటికి తగిలాయి. స్వతహాగా శాఖహారి అయిన అతడు.. ఈ విషయంపై హోటల్ నిర్వాహకులను అడుగగా.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దబాయించారు. దీంతో బాధితుడు.. సదరు హోటల్‌పై చర్య లు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫిర్యాదు చేశాడు. శాఖాహార భోజనం చేసేందుకు హోటల్‌కు వస్తే భోజనాన్ని కల్తీ చేయడంతో పాటు వచ్చిన కస్టమర్లపైకి తిరగపడడం దురదృష్టకరమని, ఈ తరహా హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
Also Read : స్థానిక ఎన్నికల వేళ.. బీజేపీలో కొత్త పంచాయితీ..పాత..కొత్త నేతల మధ్య బిగ్ ఫైట్