/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)
TPCC Chief Mahesh Kumar Goud
BIG BREAKING: రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగనున్న ఒకే ఒక నియోజక వర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 11న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్నాయి. దీనికోసం ఆయా పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించే పనిలో పడ్డారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ అభ్యర్థికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీ కి వచ్చే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు సీఎం తో చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ ఏఐ సీసీ కి పంపిస్తామని మహేష్ కుమార్ తెలిపారు. ఉప ఎన్నికల్లో ముగ్గురు ఇంచార్జీ మంత్రులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా అభ్యర్ధి ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు.కంటోన్మెంట్ ఉప ఎన్నిక మాదిరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా సుస్పష్టం అని అన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ది , సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని తేల్చి చెప్పారు.
మంత్రి పొన్నం వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు .అసత్య ప్రచారాన్ని నమ్మకండి అని సూచించారు. డిసెంబర్ ఎండింగ్( చివరి) నాటికి పార్టీ పదవులు అన్ని భర్తీ చేస్తామన్నారు.బీసీ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు తీర్పు ముందే ఊహించామన్నారు. త్వరలోనే కామారెడ్డి బహిరంగ సభ ఉంటుందని మహేష్ కుమార్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, ముగ్గురు మంత్రులతో కలిసి జూబ్లీ హిల్స్ లో బస్తీ బాట చేపడుతున్నానన్నారు. స్థానిక పరిస్థితుల బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం,సీపీఐ, జనసమితి అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తామని మహేష్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇచ్చే విషయం గురించి చూడాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?