/rtv/media/media_files/2025/10/06/jubilee-hills-by-elections-2025-10-06-15-43-18.jpg)
Jubilee Hills by-elections
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025) కు అభ్యర్థిని ఎంపిక చేయడానికి ముగ్గురి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సీఎం సూచనలతో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్(bonthu-rammohan), కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ సోమవారం ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది. వీరిలో నుంచి ఒకరిని పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీఓ ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్‌ను కూడా అదే సామాజికవర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరినట్లు తెలుస్తోంది. -- నవీన్ యాదవ్(naveen yadav), బొంతు రామ్మోహన్, CN రెడ్డి లలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.-- ముగ్గురు బలమైన నాయకులు కావడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది.కాగా ముగ్గురు అభ్యర్థుల బయోగ్రఫీని ఏఐసీసీ తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి అభ్యర్థుల బలాలు, బలహీనతలపై మనమూ ఒకసారి లుక్కేద్దాం..
Also Read : తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ స్థానిక నాయకుడు
* యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి
* AIMIM ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ
* 2014లో AIMIM అభ్యర్థిగా పోటీ, ఓటమి
* 2018లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ, ఓటమి
* 2023లో కాంగ్రెస్‌లో చేరిక
బలాలు
* స్థానిక నాయకుడు కావడం
* ఆర్థికంగా బలవంతుడు
* గతంలో పోటీ చేసిన అనుభవం
* ముస్లిం, BC వర్గాల్లో బలమైన పట్టు
* AIMIM నుంచి వచ్చిన ఓట్లను కాంగ్రెస్‌కు తీసుకొచ్చే ఛాన్స్
* గత ఓటములతో నవీన్‌పై సానుభూతి
బలహీనతలు
నవీన్ తండ్రి రౌడీ షీటర్ అని ప్రచారం
* సొంత సామాజికవర్గం నుంచి లభించని మద్దతు
* నవీన్ యాదవ్‌కు AIMIMతో ఉన్న సన్నిహిత సంబంధాలు
* నవీన్ యాదవ్‌పై హిందువుల ఓటర్లలో ఆగ్రహం
* పాకనాటి గొల్లోళ్ళ నుంచి నవీన్‌కు వ్యతిరేకత
నవీన్‌యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్‌కే టికెట్ దక్కే అవకాశాలున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
బొంతు రామ్మోహన్
*మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి
* ABVPలో విద్యార్థి నాయకుడు
* తెలంగాణ ఉద్యమం ద్వారా BRSలో చేరిక
* 2016-2021 మధ్య GHMC మేయర్‌గా(BRS) ఎన్నిక
* 2024లో కాంగ్రెస్‌లో చేరిక
* భార్య శ్రీదేవి చర్లపల్లి కార్పొరేటర్ (యాదవ సామాజికవర్గం)
బలాలు
* తెలంగాణ మొదటి మేయర్‌గా అనుభవం
* తెలంగాణ ఉద్యమ నేపథ్యం
* మాజీ మేయర్‌గా ప్రజల్లో మంచి గుర్తింపు
* మున్నూరుకాపు, యాదవ సామాజికవర్గాల సపోర్ట్
* BRS ఓట్లను చీల్చే అవకాశం
బలహీనతలు
BRS నుంచి పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరడం
* రెండు సామాజికవర్గాల బలమున్నా కాంగ్రెస్‌లో ఢిల్లీ లాబీయింగ్ లేకపోవడం
* సామాజిక ఆధారిత గొడవలు (రెడ్డి vs యాదవ)
* అంతర్గత పోటీ వల్ల ప్రచారంలో అడ్డంకులు
* రామ్మోహన్‌పై సొంత పార్టీ కార్యకర్తల అసంతృప్తి
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బొంతు రామ్మోహన్‌కు నగర మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది.
CN రెడ్డి
* రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి
* స్థానిక సమస్యలపై ప్రజా సమావేశాలు, సేవల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ
* 2020లో రహ్మత్‌నగర్ BRS కార్పొరేటర్‌గా గెలుపు
* 2023లో కాంగ్రెస్‌లో చేరిక
బలాలు
* కార్పొరేటర్ అనుభవం
* GHMCలో పని తెలిసిన వ్యక్తి
* రహ్మత్‌నగర్‌లో స్థానిక సమస్యలపై పట్టు
* పార్టీ కార్యక్రమాల్లో చురుకుదల
బలహీతనలు
* BRS నుంచి మారడం వల్ల విశ్వసనీయత సమస్యలు
* పార్టీలో అంతర్గత పోటీ
* NSUI నాయకులతో ఘర్షణలు
* జూబ్లీహిల్స్ వ్యాప్తంగా తక్కువ గుర్తింపు
ఇక రహమత్‌నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన సీఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. డివిజన్‌లో ఆయనకు ఉన్న పరిచయాలతో తప్పకుండా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?