/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t172351-2026-01-17-17-24-47.jpg)
Karimnagar Honeytrap
Karimnagar Honeytrap: ఒకరి భార్య మీద పరాయి మగవాడు చేయి వేస్తేనే ఆ భర్త ఊర్కోడు. అలాంటిది ఓ భర్త తన భార్యతో ఏకంగా శృంగారం చేయించాడు. అంతేకాదు ఆ సమయంలో వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. భార్యభర్తలిద్దరూ ఈ దందాలోకి దిగి వందలాదిమంది వద్ద ముక్కుపిండి మరి లక్షలు వసూలు చేశారు. సోషల్‌మీడియా ద్వారా ఆకర్శించడం ఆమె వంతుకాగా, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడి వసూలు చేయడం ఆయనవంతుగా సాగింది. వారి చేతిలో మోస పోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో వారు చేస్తున్న గలీజ్ దందా వెలుగుచూసింది. - Honey Trap Case
Also Read : ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లకు కేంద్రం బిగ్ షాక్: మరో 242 వెబ్‌సైట్లు బ్లాక్!
Husband And Wife's Mess With The Honeytrap
వివరాల ప్రకారం మంచిర్యాల(Mancherial) జిల్లాకు చెందిన దంపతులు కరీంనగర్(Karimnagar crime) లో నివసిస్తూ మార్బుల్ వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టాలు, ఈఎంఐల భారం పెరగడంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. భార్య సోషల్ మీడియా(Social Media) ద్వారా పురుషులను ఆకర్షించేది. తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు.ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను భయపెట్టి గత మూడేళ్లలో సుమారు 100 మంది నుండి డబ్బులు వసూలు చేశారు. ఇటీవల ఒక లారీ వ్యాపారిని రూ.13 లక్షలు డిమాండ్ చేయగా, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, హనీట్రాప్(honey-trap) పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ భార్యభర్తలిద్దరూ భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కరీంనగర్ రూరల్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు గత పదేళ్లుగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరెపల్లిలో నివసిస్తున్నారు. భర్త మార్బుల్, ఇంటీరియర్ వ్యాపారం నిర్వహిస్తుండగా, భార్య సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అయితే చేస్తున్న వ్యాపారంలో వచ్చిన నష్టాలు, పెరిగిన అప్పులు, ఫ్లాట్ ఈఎంఐలు వీరిని ఆర్థికంగా కుదిపేశాయి. ఈ పరిస్థితుల్లో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇద్దరూ కలిసి హనీట్రాప్ కు రూపకల్పన చేశారు. - honey trap telugu news
భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తూ పరిచయాలు పెంచుకునేది. ఆమె మాటల మాయలో పడిన పురుషులను అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించేది. అక్కడ ఆమె బాధితులతో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహాస్యంగా కెమెరాలతో వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపిస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగేవారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తామని, ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా గడచిన మూడేండ్లుగా ఈ దంపతులు దాదాపు వంద మందికి పైగా వ్యాపారులు, వైద్యులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది.
అక్రమంగా సంపాదించిన డబ్బుతో రూ.65 లక్షల విలువైన ప్లాట్, ఖరీదైన కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారి నుంచి ఇప్పటికే రూ.13 లక్షలు తీసుకున్న ఈ దంపతులు, మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Also Read : హైదరాబాద్‌లో దారుణం: మద్యం గ్లాస్ కోసం అన్నను లేపేసిన తమ్ముడు.
Follow Us