Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం: మద్యం గ్లాస్ కోసం అన్నను లేపేసిన తమ్ముడు.

హైదరాబాద్‌ నాచారం ప్రాంతంలో మద్యం గ్లాస్ కోసం తమ్ముడు, అన్న మధ్య గొడవ జరిగింది. తమ్ముడు తన అన్నను మూడంతస్తుల భవనం పై నుంచి తోసి హతం చేశాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Crime

Hyderabad Crime

Hyderabad Crime: హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో మద్యం తాగుతున్న క్రమంలో గ్లాస్ కోసం తమ్ముడు, అన్న మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్రంగా మారి, తమ్ముడు తన అన్నను మూడంతస్తుల భవనం పై నుంచి తోసేసాడు. స్థానికులు వెంటనే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు స్పందించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు