Cyber Crime: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు భారత్లో ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే రూ.7 వేల కోట్లు ప్రజల నుంచి కాజేసినట్లు కేంద్రం గుర్తించింది. అలాగే మే నుంచి జులై మధ్య సైబర్ కేటుగాళ్లు కొట్టేసిన మొత్తం కలుపుకుంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది.