Dhruv Sharma : ఒకపుడు రైజింగ్ బిజినెస్‌ స్టార్‌..నేడు కటకటాల్లోకి..

హరియాణాలోని  గురుగ్రామ్‌కు చెందిన  ప్రముఖ లగ్జరీ హబ్‌ ‘32 అవెన్యూ’ ఇప్పుడు రూ.500 కోట్ల కుంభకోణానికి కేంద్ర బిందువు కావడం సంచలనంగా మారింది. ఒకపుడు  రైజింగ్ బిజినెస్‌ స్టార్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో చేరిన కంపెనీ సీఈఓ ధ్రువ్‌ శర్మ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

New Update
FotoJet (11)

Dhruv Sharma

Dhruv Sharma : హరియాణా(haryana) లోని  గురుగ్రామ్‌కు చెందిన  ప్రముఖ లగ్జరీ హబ్‌ ‘32 అవెన్యూ’ ఇప్పుడు రూ.500 కోట్ల కుంభకోణానికి కేంద్ర బిందువు కావడం సంచలనంగా మారింది. ఒకపుడు  రైజింగ్ బిజినెస్‌ స్టార్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో చేరిన ఈ కంపెనీ సీఈఓ ధ్రువ్‌ శర్మ ను పోలీసులు రియల్‌ ఎస్టేట్‌ మోసం కేసులో అరెస్ట్‌ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.  

Also Read :  తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్

వివరాల్లోకి వెళ్తే ..

ధ్రువ్‌ శర్మ చెందిన కంపెనీ 32 అవెన్యూ(32 Avenue) తమను మోసగించిందంటూ ఈ ఏడాది జనవరి 2న ట్రామ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు(police-cases) చేసింది. కాగా 32 అవెన్యూ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న 3000 చదరపు అడుగుల కమర్షియల్‌ యూనిట్‌ను తాము రూ.2.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు 2021 సెప్టెంబరులో తాము ధ్రువ్‌ శర్మ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ట్రామ్‌ సంస్థ వివరించింది. ఇందుకోసం చెల్లించాల్సిన డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ.. ఇప్పటివరకూ ఆ ప్రాపర్టీని తమ పేరు మీదకు మార్పు చేయలేదని వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
ధ్రువ్‌ శర్మ కంపెనీ ఇదే ప్రాపర్టీని 2022-23 మధ్య 25 మందికి విక్రయించినట్లు తేలింది. దీన్ని దాచిపెట్టడం కోసం  ప్రతిసారీ విక్రయం పూర్తయిన తర్వాత ఆ ప్రాపర్టీని 30 ఏళ్ల వరకు లీజుకు తీసుకునేందుకు వారితో ఒప్పందం  చేసుకున్నాడు. ఇందుకోసం కొనుగోలుదారులకు ప్రతినెలా అద్దె కూడా చెల్లిస్తున్నాడు. అయితే, 2025 ఆగస్టు నుంచి ఆ చెల్లింపులు ఆగిపోవడంతో కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. ఇటీవల వీరంతా ‘32 అవెన్యూ’ ఆఫీసుకు వెళ్లగా ఈ మోసం బయటపడింది. ఇదేగాక, దేశవ్యాప్తంగా అనేక మంది ఇన్వెస్టర్లను కూడా ఆస్తుల విక్రయం పేరుతో మోసగించినట్లు విచారణలో వెల్లడైంది. చెప్పినదానికంటే చిన్న ప్రాపర్టీలు విక్రయించడం లేదా.. డబ్బులు తీసుకుని ప్రాపర్టీ బదలాయించకపోవడం వంటి మోసాలకు పాల్పడినట్లు తేలింది.

దీంతో గురుగ్రామ్‌(gurugram) ఆర్థిక నేరాల విభాగం దీనిపై కేసు నమోదు చేసి గతవారం ధ్రువ్‌ శర్మను అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడిని పోలీసు కస్టడీని అప్పగించింది. కాగా ఈ కుంభకోణం విలువ సమారు రూ.500 కోట్లు వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్ల నుంచి దోచుకున్న డబ్బుతో గోవా, రాజస్థాన్‌లలో హోటళ్లు, భూములు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఈడీకి అప్పగించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.

Also Read :  శరద్ పవార్ కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు!

ధ్రువ్‌ శర్మ గురించి..

కాగా 34 ఏళ్ల ధ్రువ్‌ శర్మ అరెస్ట్‌(arrest) కావడంతో ఆయన గురించి నెట్లో అనేకమంది సెర్చ్‌ చేస్తున్నారు. ధ్రువ్‌ శర్మ అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. ఆ మరుసటి ఏడాది భారత్‌కు తిరిగొచ్చి ‘గెస్ట్‌హౌసర్‌’ పేరుతో వెకేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించాడు. 2015లో ‘32 అవెన్యూ’ను ఏర్పాటుచేసి ఓ లగ్జరీ హబ్‌గా మార్చాడు. కాగా ఈ భవనంలోని ప్రముఖ రెస్టరంట్లు, రిటైల్‌ అవుట్‌లెట్లు వంటివి స్థానికంగా బాగా ప్రాచుర్యం పొందటంతో ఆయన పేరు ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన 2019లో ఫోర్బ్స్‌ 30 అండర్‌-30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గురుగ్రామ్‌కు న్యూయార్క్‌ లైఫ్‌స్టైల్‌ను తీసుకొచ్చిన యువ వ్యాపారవేత్తగా ధ్రువ్‌కు స్థానికంగా మంచి పేరుంది. ఈ కంపెనీకి ఢిల్లీ ఎన్సీఆర్‌, హైదరాబాద్‌, గోవాలో రియల్‌ఎస్టేట్‌ పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి. అలాంటివాడు అరెస్ట్‌ కావడంతో స్థానికంగా చర్చనీయంశగా మారింది.

Advertisment
తాజా కథనాలు