suicide : కుత్బుల్లాపూర్‎లో మహిళా ఫిజియోథెరపీస్ట్‌ డాక్టర్ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ డాక్టర్ బత్తిని అనిత (29) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

New Update
FotoJet (7)

physiotherapist suicide

suicide : ఒక మహిళా ఫిజియోథెరపీస్ట్‌ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సాయిబాబా నగర్‎లో నివాసముండే బత్తిని అనిత (29) మల్లారెడ్డి హాస్పిటల్‎లో ఫిజియోథెరపి డాక్టర్‎గా పని చేస్తోంది. అయితే ఎప్పుడు ఉత్సాహంగా ఉండే అనితకు ఏమైందో తెలియదు గానీ అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

తెల్లవారుజామున అనిత ఉరికి వేలాడుతుండడాన్ని  గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు