Beer sales: బీర్లు కొంటలేరు.. తెలంగాణలో భారీగా తగ్గిన అమ్మకాలు.. ఎందుకంటే!

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో దాదాపుగా 15% అమ్మకాలు తగ్గాయి. ఫిబ్రవరిలో బీర్ ధరలు పెరిగిన తర్వాత బీర్ కొనేవారి సంఖ్య తగ్గింది. అయితే ఎక్కువ మంది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

New Update
a-couple-sampling-beer-from-a-flight-of-craft-brew-2023-11-27-05-13-49-utc (1)

Beer sales

తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్లు ధరలు పెరిగిన తర్వాత బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 15% అమ్మకాలు తగ్గాయి. ఏప్రిల్‌లో 8 శాతం అమ్మకాలు తగ్గాయి. గత సంవత్సరం 50 లక్షలు ఉండగా ఇప్పుడు అది 46 లక్షలకు పడిపోయింది. సాధారణంగా వేసవిలో బీర్‌లు ఎక్కువగా తాగుతారు. కానీ ఈ వేసవిలో మాత్రం వీటి అమ్మకాలు భారీగా తగ్గాయి.

ఇది కూడా చూడండి:BIG BREAKING: రేవంత్‌ రెడ్డికి బిగ్‌షాక్‌.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఛార్జిషీట్‌

ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికే..

ఎక్కువ మంది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది IMFL అమ్మకాలు 30 లక్షల కొనగా.. ఈ ఏడాది అవి 32 లక్షల పెరిగాయి. బీర్ అమ్మకాలు 8% తగ్గినా IMFL అమ్మకాలు మాత్రం 6% పెరిగాయి. బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) అభ్యర్థనల మేరకు సరఫరాలను నిలిపివేశారు.

ఇది కూడా చూడండి:Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

దీని తర్వాత తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు బీర్ ధరలను 15% పెంచడానికి అనుమతించింది. ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వీటి ధరలను పెంచింది. కానీ ఇది అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీగా బీర్లు అమ్మకాలు భారీగా తగ్గాయి. 

ఇది కూడా చూడండి:Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక

ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. బీర్ల ధరలు పెరగడంతో ఎక్కువగా IMFL బీర్లు కొంటున్నట్లు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో కూడా తెలిపాడు. 

Advertisment
తాజా కథనాలు