Bangladesh: భారత్‌ నుంచి కీలక కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు దూరమవుతోంది. తాజాగా సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్‌ బోట్‌ నిర్మాణం కోసం రక్షణ రంగానికి చెందిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్ -ఇంజినీర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని తాజాగా రద్దు చేసుకుంది.

New Update
Bangladesh cancels 180 crores defence contract with India amid diplomatic strain

Bangladesh cancels 180 crores defence contract with India amid diplomatic strain

బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం.. భారత్‌తో సంబంధాలు దూరం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూనస్‌ సర్కార్‌.. భారత్‌కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్‌ బోట్‌ నిర్మాణం కోసం కోల్‌కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్-ఇంజినీర్స్‌ (GRSE)తో జరిగిన ఒప్పందాన్ని తాజాగా రద్దు చేసుకుంది. దీని విలువ ఏకంగా రూ.180.25 కోట్లు కావడం గమనార్హం.  

Also Read: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

Bangladesh Cancels India Contract

అయితే GRSE అనేది భారత రక్షణశాఖ కింద పనిచేస్తోంది. బంగ్లాదేశ్‌తో ఈ ఒప్పందం రద్దయినట్లు స్టాక్‌ మార్కెట్‌కు కూడా చెప్పింది. అయితే టగ్‌ బోట్లను ఓడలు నెట్టేందుకు, సాల్వేజ్ ఆపరేషన్ల కోసం వినియోగిస్తారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు యూనస్‌ చైనాతో సంబంధాలు పెంచుకుంటున్నారు. అందుకే ఆయన తరచుగా భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

ఇటీవల చైనా పర్యటనలో కూడా యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భూభాగంతో మూసుకుపోయిందని తెలిపారు. ఈ ప్రాంతాలకు సముద్రంతో లింక్ చేసేందుకు రాజధాని ఢాకానే దిక్కని అన్నారు. ఆయన కార్యవర్గంలో ఉండేవారు కూడా ఈమధ్య ఎక్కువగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఈ చర్యలు భారత్‌లో దూరాన్ని పెంచుతున్నాయి. దీంతో భారత్ కూడా ప్రతిచర్యలకు దిగింది. బంగ్లాదేశ్‌కు సరకును భారత్‌ మీద నుంచి రవాణా అయ్యేందుకు ఉన్న పర్మిషన్లను రద్దు చేసింది.   

Also Read: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి

Also Read :  గ్యాంగ్‌రేప్‌ నిందితులకు బెయిల్‌.. బయటకు వచ్చాక రోడ్లపై హల్ చల్

bangladesh | muhammad yunus bangladesh | national-news | rtv-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు