ఐదేళ్ల తర్వాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్
ఇటీవలె తజికిస్తాన్ లో చైనా సైనిక స్థావర ఫోటోలు బయటకి వచ్చాయి. చైనా కావాలనే భారత్ పై రహస్య గూఢాచార్యం చేసేందుకే పాక్,శ్రీలంక దేశాలకు రుణాలు ఇచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుందని గతంలో విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. తాజాగా ఈ ఉదంతం తజికిస్తాన్ లో కూడా వెలుగుచూసింది.
రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అమెరికా-చైనా రెండూ పెద్ద దేశాలే. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా రెండు దేశాలకు మధ్య వాణిజ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.
చైనాలో జననాల కంటే మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. 1961తర్వాత తొలిసారి జనాభా తగ్గుదలను చవిచూసిన చైనా పిల్లల్ని కనండి మహాప్రభో అని మొత్తుకుంటోంది. దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోవడమే దీనికి కారణం. సాక్ష్యాత్తు దేశ అధ్యక్షుడు జిన్‌పింగే మహిళలకు కీలక సూచనలు చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సామరస్యం బట్టి మహిళల ఎదుగుదలను చూడాలంటూ జిన్‌పింగ్ కామెంట్స్ చేశారు.
చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్‌తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరు కావడం పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. బైడెన్ ఒక్క రోజు ముందుగానే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుండగా.. మోదీతో బైడెన్ ఈ నెల 8న భేటీ కానున్నారు. మరోవైపు జిన్‌పింగ్ డుమ్మా వెనుక అరుణాచల్ ప్రదేశ్ అంశం ముడిపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓవైపు ఇండియా-చైనా మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు డ్రాగన్ మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. సరిహద్దుల్లో నిర్మాణాలు చేపడుతోంది. సరిహద్దులో వేగంగా రోడ్లు,శాశ్వత సైనిక గూడారాల నిర్మాణం చేపడుతున్నట్టు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఫొటోలల్లో భారీ యంత్రాలు, ట్రక్కులు కనిపిస్తున్నాయి.
జనాభా పెరిగినా కష్టమే..తగ్గిన కష్టమే. చైనాను చూస్తుంటే ఇది నిజమే అనక తప్పదు. మొన్నటివరకు అత్యధిక జనాభాతో ఎంత ఉత్పాదకత ఉన్నా ఉత్పత్తులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడేమో జనాభా తగ్గిపోయి..పనిచేసే వయస్సున్న వారి సంఖ్య క్షీణించడంతో తీవ్ర అవస్థలు పడుతోంది. చైనాలో జనాభా ఊహించినదాని కంటే వేగంగా తగ్గిపోతుంది. చైనా సంతానోత్పత్తి రేటు 2022లో రికార్డు స్థాయిలో 1.09కి పడిపోయిందని నేషనల్ బిజినెస్ డైలీ మంగళవారం తెలిపింది.