USA-CHINA: చేతులు కలిపిన అమెరికా, చైనా..టారిఫ్ ల నుంచి ఊరట

అమెరికా, చైనాలు కలిసి పోయాయి. ఇరు దేశాల అధినేతలూ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చేశారు. ఫలితంగా రెండు గంటల సమావేశం తర్వాత చైనాపై 10 శాతం టారిఫ్ లను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. 

New Update
trump-jin

Donald Trump shakes hands with Xi Jinping as they hold a bilateral meeting in Busan.

దాదాపు ఆరు నెలలుగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. చెప్పిన మాట వినడం లేదని, ఖనిజాల విషయంలో ఒప్పందం కుదుర్చుకోలేదని ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్(america president donald trump)...చైనాపై 122 శాతం టారిఫ్ లను విధించారు. దీనికి చైనా కూడా గట్టిగానే బదులిచ్చింది. ఆ దేశం కూడా అమెరికాపై అంతే టారిఫ్ లను విధించింది. దీంతో రెండు దేశాల మధ్యా వాణిజ్యపరంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. ఈ నేపథ్యంలో ఈరోజు దక్షిణ కొరియాలో ట్రంప్, జిన్ పింగ్(Xi Jinping) లు భేటీ అయ్యారు. యావత్ ప్రపంచం దీనిపై ఆసక్తి కనబరిచింది. 

Also Read :  కారుపై మూత్ర విసర్జన..అడిగినందుకు భారత సంతతి వ్యక్తి హత్య..కెనడాలో దారుణం

అన్ని విషయాలపై అంగీకారం..

దాదాపు రెండు గంటల పాటూ భేటీ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీ తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై 10 శాతం మేర సుంకాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. జిన్ పింగ్ తో భేటీ అద్భుతంగా జరిగిందని..పలు అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు. ఫెంటనిల్‌ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్‌పింగ్‌ చర్యలు తీసుకుంటారని అన్నారు. అందుకే ఫెంటనిల్‌ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతానికి తగ్గిస్తున్నా. దీంతో బీజింగ్‌పై మొత్తం టారిఫ్‌లు 57శాతం నుంచి 47శాతానికి దిగి రానున్నాయి. అలాగే సోయాబీన్ వ్యాపారంపై కూడా రెండు దేశాల మధ్యనా అంగీకారం కుదిరిందని..కొనుగోళ్ళను చైనా తక్షణమే పురుద్ధరిస్తుందని ట్రంప్ చెప్పారు. 

అన్నిటి కంటే ముఖ్యంగా రేర్ ఎర్త్ ఖనిజాలకు సంబంధించి కూడా ట్రంప్, జిన్ పింగ్ ల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం అయిందని..ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రంప్ చెప్పారు. ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీంతో చైనాకు చాలా పెద్ద ఊరటే లభించింది. వంద శాతం సుంకాల భయం పోయింది. 

Also Read :  చాలా మంచివారు.. కానీ కఠినాత్ముడు.. ప్రధాని మోదీపై ట్రంప్ వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు