/rtv/media/media_files/2025/08/08/china-welcomes-pm-modi-for-sco-summit-2025-08-08-20-04-41.jpg)
China Welcomes PM Modi For SCO Summit
ప్రధాని మోదీ ఆగస్టు చివర్లో చైనాకు వెళ్లనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కీలక అప్‌డేట్ వచ్చింది. తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (SCO)లో పాల్గొనేందుకు రావాలని మోదీకి చైనా శుక్రవారం అధికారికంగా ఆహ్వానం పలికింది. ఈ శిఖరాగ్ర మీటింగ్ ఇరు దేశాల మధ్య స్నేహం, సంఘీభావానికి వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 30న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌కు వెళ్లనున్నారు.
Also read: ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ వార్నింగ్.. 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
ఆ తర్వాత ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొననున్నారు. దీనిపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువా జియాకున్ స్పందించారు. SCO దేశాలతో సహా 20 దేశాధినేతలు అలాగే 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులు దీనికి హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు దెబ్బపడింది.
Also Read: గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మరో ఏడాది అవకాశం
నాలుగేళ్ల పాటు భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీకి సంబంధించిన విషయంలో ఇరు దేశాలకి అంగీకారం కుదిరింది. దీంతో ఎట్టకేలకు అక్కడ సుదీర్ఘంగా కొనసాగిన ప్రతిష్టంభన వీడింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సానుకూల వాతావరణ ఉన్న నేపథ్యంలో ప్రధానీ మోదీ పర్యటన ఖరారైంది.
China welcomes 🇮🇳Indian Prime Minister Narendra Modi to China for the Shanghai Cooperation Organization Tianjin Summit.#SCO
— CHINA MFA Spokesperson 中国外交部发言人 (@MFA_China) August 8, 2025
Full text:https://t.co/kyc4CjDIRGpic.twitter.com/p2KEleWuB3
అయితే 2019 తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనకు ముందు భారత్, చైనాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. ఇదిలాఉండగా ఇటీవలే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జై శంకర్ చైనాలో పర్యటించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి పాటించకూడదని.. లష్కరే తయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారు ఆ మీటింగ్‌లో చెప్పారు.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !
ఇదిలాఉండగా షాంఘై సహకార సంస్థలో భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఖజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, కిర్గిస్థాన్ తజికిస్థాన్ మొత్తం తొమ్మిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది తయాంజిన్‌లో జరగనున్న ఈ సదస్సు చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుంది చైనా పేర్కొంది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.