Modi China Visit: 2019 తర్వాత ఫస్ట్ టైం.. చైనా పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

New Update
modi china visit

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చైనా పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో కీలక పరిణామంగా పరిగణించబడుతోంది.

Also Read :  ఏలియన్స్ వస్తున్నాయి.. సౌరకుటుంబంలోకి కొత్త గ్రహం

PM Modi To Visit China

ఈ పర్యటనలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు దేశాల సరిహద్దు వివాదాలు, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రధాని మోదీ, జిన్ పింగ్ రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఈ సదస్సులో SCO Summit సభ్య దేశాలైన రష్యా, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాల నాయకులతో కూడా ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. SCO డైలాగ్ పార్ట్‌నర్స్ టర్కీ, అజర్బైజాన్ ఈ సమావేశానికి హాజరుపై భారతదేశం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ దేశాలు  పాకిస్తాన్‌కు మద్దతు తెలిపినందుకే భారత్ ఇలా చేసింది. ఇది సదస్సులో ఒక కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

చైనా ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సులో వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడతాయని, సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి ఇది దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీఓ స్థాపక లక్ష్యాలకు అనుగుణంగా ఉగ్రవాదంపై రాజీలేని వైఖరిని అవలంబించాల్సిన అవసరాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే చైనాలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో నొక్కి చెప్పారు. ఈ అంశం కూడా సదస్సులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read :  'ట్రంప్‌ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ

Advertisment
తాజా కథనాలు