Trump -Jinping:  వాణిజ్య యుద్ధం ముగియనుందా..? ఆరేళ్ల తర్వాత ట్రంప్‌, జిన్‌పింగ్‌ భేటీ

నిన్న మొన్నటి వరకు వాణిజ్య యుద్ధంతో తగువులాడుకున్న చైనా, అమెరికా మళ్లీ ఒకటయ్యాయి. సుమారు ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియాలోని బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ముఖాముఖి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

New Update
Trump -Jinping

Trump -Jinping

 Trump -Jinping:  నిన్న మొన్నటి వరకు వాణిజ్య యుద్ధంతో తగువులాడుకున్న చైనా, అమెరికా మళ్లీ ఒకటయ్యాయి. సుమారు ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియాలోని బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ముఖాముఖి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ కొరియా కేంద్రంగా బూసాన్‌లో జరిగిన వీరి సమావేశం సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధం ఉందంటూ పొకడ్తలు కురిపించారు. కాగా 2019లో జపాన్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇరువురి నేతలు చివరి సారిగా భేటీ అయిన విషయం తెలిసిందే.

‘నా స్నేహితుడు, చాలాకాలంగా చైనాకు అత్యంత విశిష్టమైన, గౌరవనీయమైన అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలవడం గౌరవంగా ఉంది. మేము ఇప్పటికే చాలా విషయాలు అంగీకరించాం. ఇప్పుడు మరికొన్నింటిని అంగీకరిస్తాం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒక గొప్ప దేశానికి.. మంచి నాయకుడు. మా మధ్య అద్భుతమైన సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని నేను భావిస్తున్నా’ అంటూ  ట్రంప్‌ పింగ్‌ పై ప్రశంసలు కురిపించాడు. అనంతరం  జిన్‌పింగ్ మాట్లాడుతూ..  చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ట్రంప్‌ను కలవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ మార్గదర్శకత్వంలో ఇరుదేశాల సంబంధాలు స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం సహాజం అంటూ పింగ్‌ పేర్కొనడం గమనార్హం.   

అదే సమయంలో సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని సూచించారు. ప్రపంచ శాంతి కోసం ట్రంప్‌ శ్రద్ధ వహిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలను ఆపేందుకు ట్రంప్‌ చేస్తున్న శాంతి ప్రయత్నాలను జిన్‌పింగ్‌ ప్రశంసించారు. ఇటీవల గాజా కాల్పుల విరమణకు చేసిన కృషి అభినందనీయమన్నారు.  ప్రస్తుతం ప్రపంచం అనేక కఠిన సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రపంచంలోఒ ప్రధాన దేశాలైన చైనా, అమెరికాలు మొత్తం ప్రపంచం మంచి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమెరికా- చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలను గురించి కూడా జిన్‌పింగ్‌ ట్రంప్‌తో ప్రస్తావించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు!

Advertisment
తాజా కథనాలు