/rtv/media/media_files/2025/06/27/china-purges-senior-military-official-miao-hua-from-top-ruling-body-2025-06-27-16-46-00.jpg)
China purges senior military official Miao Hua from top ruling body
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సన్నిహత జనరల్ మియా హువను సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి తొలగించారు. పార్లమెంటులో ఓటింగ్ ద్వారా ఆయన్ని విధుల నుంచి బహిష్కరించారు. అక్కడి మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2024 నవంబర్‌లో మియా హువ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకున్నారు. గతంలో లిబరేషన్ ఆర్మీ రాజకీయ సిద్ధాంత విభాగానికి కూడా మియా అధిపతిగా వ్యవహరించారు.
Also Read: జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి, జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. VIDEO
చైనా సీనియర్ రక్షణశాఖ వైబ్‌సైట్‌లో ఉండే అధికారుల పేర్ల జాబితా నుంచి కూడా తాజాగా మియా పేరు, ఫొటోను తొలగించారు. అలాగే చైనా నేషనల్ లెజిస్లేచర్ నుంచి కూడా తీసేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రతినిధి హోదా నుంచి తప్పించాలని సెంట్రల్ మిలటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. చైనా సైన్యంలో అవినీతికి తావులేకుండా చేసేందుకే జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది కీలక జనరల్స్‌తో పాటు డిఫెన్స్ రంగంలోని పరిశ్రమలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లపై కూడా చర్యలు తీసుకున్నారు.
Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
గతంలో ఫుజియన్ ప్రావిన్స్‌లో జిన్‌పింగ్ స్థానిక అధికారిగా పనిచేసే సమయంలో మియా కూడా అక్కడే పనిచేసేవారు. వాళ్ల మధ్య ఉన్న అనుబంధంతో జిన్‌పింగ్.. మియాను సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు తీసుకొచ్చారు. మరోవైపు వైస్ అడ్మిరల్ లి హాంజున్‌ను కూడా పార్లమెంటరీ ప్రతినిధి హోదా నుంచి తొలగించారు. గతంలో ఈయన పీఎల్‌ఏ నేవీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసేవారు. సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు చెందిన మరో కీలక నేత హీ వీడాంగ్ కూడా బాహ్య ప్రపంచంలో కనిపించకుండా పోయారు.