Vladimir Putin: చైనాలో పుతిన్‌కు చేదు అనుభవం.. సభలో మాట్లాడుతుండగానే..
చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్‌తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.