HMPV వైరస్ పై WHO మాజీ సైంటిస్ట్ షాకింగ్ న్యూస్
HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు.
HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు.
చైనాలో ప్రబలుతున్న హ్యూమన్ మెటానిమో వైరస్ సాధారణంగా లేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వోకు ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో WHO ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధారణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎంపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఎంపాక్స్ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని తెలిపింది.
కోవిడ్ లేదా కరోనా...దీని పేరు వింటేనే అందరి గుండెల్లో దడ పుడుతుంది. రెండేళ్ళు మరణ మృదంగం వాయించిన ఈ మహమ్మారి మళ్ళీ భయపెడుతోంది. కొన్ని వారాలుగా 84 దేశాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్వో కూడా వార్నింగ్ ఇస్తోంది.
గత కొన్ని రోజులుగా 84 దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని WHO తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త కోవిడ్ వేరియంట్లు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యువత 30 ఏళ్లు కూడా దాటకముందే అనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడించింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించింది.
భారత్లో మరో ప్రమాదకర వైరస్ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని నాలుగేళ్ల చిన్నారిలో H9N2 వైరస్ వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది. 2019లో ఈ వైరస్ మొదటి కేసు నమోదు అయినట్లు తెలిపింది.