/rtv/media/media_files/2025/10/05/dirty-cholesterol-2025-10-05-12-10-46.jpg)
Dirty Cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు పెరగడం చాలా ప్రమాదకరం. ఇది గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సర్వసాధారణ సమస్యగా మారింది. అయితే చాలా మంది రోగులు దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తుంటారు. ఈ అభిప్రాయాన్ని కార్డియాలజిస్ట్ డాక్టర్లు ఖండిస్తున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలు జన్యుపరమైన కారణాల వల్ల పెరగవు. తప్పుడు ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల పెరుగుతాయి చెబుతుంటారు. ఈ సమస్యకు జీవనశైలి అలవాట్లే ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సిరల్లో చిక్కుకున్న మురికి కొలెస్ట్రాల్ బయటకు ఎలాంటి వస్తుందో..? చేయాల్సిన పని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బరువు తగ్గడం వల్ల..
కొలెస్ట్రాల్ నియంత్రణలో బరువు తగ్గడం (Weight Loss) కీలక పాత్ర పోషిస్తుంది. 10 కిలోల బరువు తగ్గడం వల్ల LDL కొలెస్ట్రాల్ 7-9 mg/dL వరకు తగ్గుతుంది. శరీర బరువులో మొదటి 5-10 శాతం తగ్గడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) మొత్తం కొలెస్ట్రాల్‌లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. చిన్న మొత్తంలో బరువు తగ్గినా.. అది సమతుల్య ఆహారం, మందుల వంటి చికిత్సలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మెటబాలిజాన్ని, ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చెడు అలవాట్ల విషయానికి వస్తే ఆల్కహాల్, ధూమపానం పూర్తిగా మానేయాలని వైద్యులు స్పష్టంగా సూచించారు.
ఇది కూడా చదవండి: ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు సులభ మార్గాలు ఇవే
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఆరోగ్యానికి సురక్షితమైన ఆల్కహాల్ మోతాదు లేదు. ఇది రక్తపోటును పెంచి, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వంటి గుండె సమస్యలను, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ధూమపానం కేవలం కొలెస్ట్రాల్‌కే కాక.. మొత్తం రక్తనాళాల ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇది మంచి HDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులతో అకాల మరణాలకు ధూమపానమే ప్రధాన కారణమని ఆరోగ్య సంస్థలు పేర్కొంటున్నాయి. ధూమపానాన్ని త్వరగా మానేయడం వల్ల HDL మెరుగుపడి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే.. జన్యువులను నిందించకుండా.. జీవనశైలి అలవాట్లను వెంటనే మార్చుకోవడం మొదలు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సండే అని చికెన్, మటన్ కుమ్మేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!