AI in Ayush Systems: భారత్‌ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు

భారత్ ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమీకరించన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని WHO ప్రకటించింది. భారత్ ప్రాచీన వైద్య పద్ధతులను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చిన తొలి దేశం.

New Update
Ayush Systems

భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమీకరించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత్ ప్రాచీన వైద్య పద్ధతులను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చిన తొలి దేశం నిలిచింది. ఆయుష్ వైద్య విధానాల వివరాలను కూడా ఏఐతో ఇండియా సమీకరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే శీర్షికలో ఈ రంగంలో ఏఐ ద్వారా విజయవంతమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించామని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

ఆయుర్వేదం, సిద్ధ, యునాని, సోవా రిగ్పా, హోమియోపతి తదితర వైద్య విధానాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఈ డిజిటల్ లైబ్రరీలో సేకరించి, ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ వైద్య నిపుణులకు అందుబాటులో ఉంచింది. ఈ సమాచారాన్ని అర్థవంతంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఏఐ టూల్స్ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనపై భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఆయుష్‌ జీనోమిక్స్ అనే కాన్సెప్ట్‌ను డబ్ల్యూహెచ్‌ఓ కొనియాడింది. ఇది ఆయుర్వేద సిద్ధాంతాలను జీనోమిక్స్‌తో మిళితం చేసే శాస్త్రీయ ప్రయోగం.

Advertisment
Advertisment
తాజా కథనాలు