Mpox: విస్తరిస్తోన్న ఎంపాక్స్ వైరస్‌.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

ఎంపాక్స్ వైరస్‌ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఎంపాక్స్‌ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని తెలిపింది.

New Update
Mpox: విస్తరిస్తోన్న ఎంపాక్స్ వైరస్‌.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ మంకీపాక్స్‌ (ఇప్పుడు ఎంపాక్స్‌) వైరస్ కలకలం రేపుతోంది. గతంలో కేవలం ఆఫ్రీకాలోని పలు దేశాలకు పరిమితమైన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) కాస్త ఊరటనిచ్చే మాట చెప్పింది. ఎంపాక్స్‌ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది.

Also read: నా కేబినెట్‌ లో మస్క్‌: ట్రంప్‌!

ప్రస్తుతం WHOలో యూరప్‌ రీజినల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హాన్స్ క్లుగే మీడియాతో మాట్లాడారు. '' ఎంపాక్స్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు, పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ప్రపంచం స్పందించే తీరు కీలకం. కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి. ఈ వైరస్‌ను మనం నియంత్రిస్తామా లేదా మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. రాబోయే ఏళ్లలో, యూరప్, ప్రపంచానికి ఇది మరో పరీక్షే'' అని హాన్స్ క్లుగే హెచ్చరించారు.

ఇదిలాఉండగా.. ఎంపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు ఆదేశాలు జారీ చేసింది. అలాగే బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల వద్ద కూడా నిఘా పెంచాలని.. ఎంపాక్స్ లక్షణాలు ఉన్నవారు కనిపిస్తే వెంటనే చెప్పాలని సూచించింది. ఈ వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌ కోసం ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా, సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్‌ ఆస్పత్రులను ఆరోగ్యశాఖ గుర్తించింది.

Also Read: నిండు సభలో కంటతడి పెట్టిన బైడెన్‌..ఎందుకంటే!

'WHO' లెక్కల ప్రకారం.. 2022 నుంచి ఇప్పటిదాకా 116 దేశాలకు ఎంపాక్స్ వైరస్ వ్యాపించింది. మొత్తం 99,176 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆఫ్రికాలోని కాంగోలో ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 15,600 కేసులు నమోదయ్యాయి. అందులో 537 మంది మరణించారు. ఇక భారత్‌లో 2022 నుంచి ఇప్పటిదాకా 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2024లో చివరి కేసు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత అప్పటినుంచి ఎంపాక్స్ కేసులు కొత్తగా నమోదుకాలేవని పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్‌లో నలుగురుకి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు