Delhi AIIMS: మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఢిల్లీ ఎయిమ్స్ కీలక మార్గదర్శకాలు! ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో WHO ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధారణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 21 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MPox: ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ ఓ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్థారణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంపాక్స్ కేసులు బాగా పెరిగాయి...ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15,600 కేసులు, 537 మరణాలు నమోదయ్యాయి. మన దేశంలో మార్చి తర్వాత కొత్తగా ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. కనుక మన దగ్గర వ్యాప్తి తీవ్రత తక్కువేనని ప్రభుత్వం వివరించింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ ఏం చెప్పిందంటే... అత్యవసర విభాగాల్లో ఎంపాక్స్ కేసుల పరీక్షల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. జ్వరం, దద్దుర్లు వచ్చిన వారికి, ఎంపాక్స్ నిర్థారిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్థారణ చేయాలి. అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్‌లో ఉంచాలి. తద్వారా ఇతరులకు సోకకుండా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఎంపాక్స్ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్థారణ, చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించాలి. రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. ఎంపాక్స్ అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించాలి. మంకీపాక్స్‌లో క్లాడ్-1 , క్లాడ్-2 అనే రెండు రకాల వేరియంట్లు విజృంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిల్లో క్లాడ్-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా, క్లాడ్-2 తక్కువ ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్లాడ్-1 కారణంగా న్యూమోనియా, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు సైతం వస్తాయి. మరణాల రేటు కూడా 1 నుంచి 10 శాతం వరకు ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. Also Read: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్! #mpox #who #aiims #delhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి